టీఆర్ఎస్ లో వారిపై కమలనాధుల ఫోకస్; చాప క్రింద నీరులా.. బండి సంజయ్ వ్యూహం
టీఆర్ఎస్ లో కీలక నాయకులపై కాషాయదండు ఫోకస్ చేసిందా? చాప క్రింద నీరులా బండి సంజయ్ వ్యూహం పనిచేస్తుందా? టిఆర్ఎస్ పార్టీ ని టార్గెట్ చేస్తూ బీజేపీని బలోపేతం చేయడానికి, 2024 ఎన్నికలకు ఇప్పటి నుంచే ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందా? ముఖ్యంగా టిఆర్ఎస్ పార్టీపై కమలనాథులు చేస్తున్న కసరత్తు భవిష్యత్తు ఎన్నికలలో సత్ఫలితాలను ఇస్తుందా? అంటే అవుననే భావన బీజేపీ నేతల్లో వ్యక్తమవుతోంది.

బీజేపీని బలోపేతం చెయ్యటంపై బండి సంజయ్ ఫోకస్
తెలంగాణ రాష్ట్రంలో అధికార టీఆర్ఎస్ పార్టీని ధీటుగా ఎదుర్కోవడానికి కమలనాథుల వ్యూహాలు రచిస్తున్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి దూకుడుగా ముందుకు వెళుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తి బిజెపి అని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఇక ఇదే సమయంలో బీజేపీని క్షేత్రస్థాయిలో బలోపేతం చేయడానికి కూడా కసరత్తులు చేస్తున్నారు. బిజెపిలో బలమైన నాయకులు లేకపోవడంతో, ఇతర పార్టీల నుండి బలమైన నాయకులను బిజెపి వైపు ఆకర్షించే పనిలో పడ్డారు.

అసంతృప్తులను ఆకట్టుకునే పనిలో బీజేపీ
ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ నుండి ప్రతి జిల్లాలోనూ అసంతృప్తులను గుర్తించి వారిని బిజెపి వైపు ఆకట్టుకునే పనిలో కమలదళం పనిచేస్తుంది. మరోవైపు కాంగ్రెస్ పార్టీ నుండి కూడా గతంలో ఒక వెలుగు వెలిగిన కీలక నేతలను బిజెపి వైపు తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో తన ప్రాభవాన్ని పూర్తిగా కోల్పోతున్న క్రమంలో కమలనాథులు కాంగ్రెస్ లోని కీలక నేతలను వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేర్చుకుని ప్రజల్లోకి బలంగా వెళ్లాలని చూస్తున్నారు.

టీఆర్ఎస్ లో అసంతృప్త నేతలకు బండి సంజయ్ గాలం
ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి అధికార పార్టీ ఉన్న టిఆర్ఎస్ పార్టీలో ఇప్పటి ముబ్బడిగా ఇతర పార్టీల నుండి నేతలు చేరడంతో దాదాపు అన్ని జిల్లాలలోనూ పార్టీలో అసంతృప్త నేతలు టిఆర్ఎస్ పార్టీలో పెరిగిపోయారు. వారు గులాబీ పార్టీలో ఉండలేక, పార్టీ నుండి బయటకు పోలేక ఇబ్బంది పడుతున్నారు. అటువంటి అసంతృప్త నేతలపై ఫోకస్ పెట్టిన బిజెపి వారితో సంప్రదింపులు జరుపుతోంది. జిల్లాకో టీమ్ ను ఏర్పాటు చేసి గుట్టుచప్పుడు కాకుండా పార్టీలో చేర్చుకోవడానికి వారితో చర్చలు జరుపుతోంది.

తెలంగాణాపై బీజేపీ అధిష్టానం ఫోకస్, బండి సంజయ్ వ్యూహం
ఒకవైపు తెలంగాణ రాష్ట్రం పై ఫోకస్ చేస్తున్నామని బీజేపీ అధిష్టానం ప్రకటనలు జారీ చేస్తుంటే, మరోవైపు బండి సంజయ్ నేతృత్వంలోని కమలదళం చాప కింద నీరులా పనిచేస్తూ టిఆర్ఎస్ పార్టీలో అసంతృప్తులతో సంప్రదింపులు మొదలు పెట్టింది. ఇప్పటికే ఖమ్మం జిల్లాలోని అసంతృప్త నేతలకు బిజెపి ఎర వేసినట్లుగా సమాచారం. ఇప్పటికే మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తనకు బీజేపీ టచ్ లో ఉందని చెప్పటం గమనార్హం. జిల్లాల వారీగా ఈ పని మొదలుపెట్టినట్టు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి పట్టున్న ఖమ్మం జిల్లాలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలోని నేతలు పక్క పార్టీల వంక చూస్తున్న పరిస్థితి ఉంది. దీంతో కాంగ్రెస్ పార్టీలో బలమైన నాయకులను కూడా బిజెపిలో చేర్చుకునేందుకు వ్యూహాలు రచిస్తున్నారు.

బలమైన నేతలను పార్టీలో చేర్చుకునే వ్యూహాలలో బీజేపీ
టిఆర్ఎస్ పార్టీ ఊహించని విధంగా వచ్చే ఎన్నికలలో షాక్ ఇవ్వాలని ఇప్పటి నుండే ప్రణాళికాబద్ధంగా పని చేస్తున్నారు. అంతే కాదు కాంగ్రెస్, టిఆర్ఎస్ పార్టీలో అంతర్గత వ్యవహారాలపై కూడా ప్రత్యేకంగా దృష్టి సారించి, పార్టీలో జరుగుతుంది ఎప్పటికప్పుడు తెలుసుకొని తదనుగుణంగా బిజెపి నాయకులు అడుగులు వేస్తున్నారు. ఏది ఏమైనా అసంతృప్తులను, ఇతర పార్టీల్లోని బలమైన నేతలను బిజెపి బాట పట్టించేందుకు కాషాయ దండు శతవిధాలా ప్రయత్నిస్తోంది.
-
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!! -
బెంగళూరుకు వందేభారత్ స్లీపర్, రైల్వే మంత్రి ప్రకటన- రూట్, హాల్టింగ్..!! -
కలియుగ వైకుంఠంలో అద్భుతం; తిరుమల చరిత్రలో తొలిసారి.. -
మ్యాచ్ గెలిచినా.. ఆనందం లేకపాయె -
దళపతితో చేతులు కలిపిన దీదీ, ఇండియా కూటమిలో ప్రకంపనలు -
జన్మ నక్షత్రం మృగశిర, ఆరుద్ర ఉన్నవారి మే నెల జాతక ఫలం -
ఎంత సీఎం అయినా.. !! -
DA సున్నా?: ఫిట్మెంట్ ఫ్యాక్టర్ పీక్స్! శాలరీ హైక్ రిపోర్ట్ -
సీనియర్ ఎన్టీఆర్కు బాగా ఇష్టమైన చిరంజీవి సినిమా












Click it and Unblock the Notifications