రాసి పెట్టుకోండి: చేవెళ్లలో బీజేపీ గెలుపుపై కొండా విశ్వేశ్వర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

ప్రధాని నరేంద్ర మోడీపై నమ్మకంతోనే చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గంలో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందన్నారు ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి. చేవెళ్లలో తమ ఫస్ట్ రౌండ్ ప్రచారం అయిపోయిందని తెలిపారు. చేవెళ్లలో సర్వే చేయించామని.. గెలిచేది బీజేపీయేనని స్పష్టమైందన్నారు. చేవెళ్ల సీటు మోడీదేనని.. ఇది రాసి పెట్టుకోవచ్చని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

తమ పార్టీపై ప్రత్యర్థులు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటేనని అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ప్రచారం చేశారని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు. లిక్కర్ కేసులో తాము చర్యలు తీసుకోకపోవడంతో అలా అనుకున్నారన్నారు. లిక్కర్ కేసులో రాష్ట్రానికి చెందిన డబ్బులు ఉన్నాయని.. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మారినా.. కాంగ్రెస్ సర్కారు ఎలాంటి చర్యలు ఎందుకు తీసుకోవడం లేదని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.

BJP going to win with huge majority in chevella LS seat Konda Vishweshwar reddy

ఇద్దరు ఎంపీపీలు, ఒక జడ్పీటీసీ, సర్పంచులు, అంతకంటే పైస్థాయిలో ఉన్న ఇద్దరు లేదా ముగ్గురు నేతలు బీజేపీలోకి వచ్చే అవకాశం ఉందని కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. జితేందర్ రెడ్డికి టికెట్ దక్కకపోవడంపై స్పందిస్తూ.. ఆయన తనకు మంచి మిత్రుడని కొండా తెలిపారు. ఆయనకు టికెట్ రాకపోవడం బాధాకరమన్నారు. వ్యక్తిగతంగా డీకే అరుణ, జితేందర్ రెడ్డి ఇద్దరూ పెద్ద లీడర్లేనని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి చాలా చోట్ల అభ్యర్థులు దొరకట్లేదని.. అందుకే టికెట్ రాని ఇతర పార్టీల నేతలవైపు చూస్తున్నారని విమర్శించారు.

జితేందర్ రెడ్డి పార్టీ మారతారని తాను భావించడం లేదని అన్నారు కొండా విశ్వేశ్వర్ రెడ్డి. మరోవైపు, బీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి బీజేపీలోకి వస్తారన్నా.. తనకు అభ్యంతరం లేదని తెలిపారు. నల్గొండ, ఖమ్మంలో కూడా బీజేపీ గెలిచేందుకు అవకాశం ఉందన్నారు. హైదరాబాద్ ఎంపీ నియోజకవర్గంలోనే విజయం సాధిస్తామని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. తెలంగాణలో 12కుపైగా ఎంపీ సీట్లు గెలిచినా ఆశ్చర్యపోనవసరం లేదన్నారు. కేంద్రం తీసుకొచ్చిన సీఏఏపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. సీఏఏ ఎవరికీ వ్యతిరేకం కాదన్నారు. కానీ, కొన్ని పార్టీలు పనిగట్టుకుని తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ధ్వజమెత్తారు.

ముస్లింలు పౌరసత్వం కోల్పోయే ప్రమాదం ఉందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. కానీ, దేశంలోని ఏ ముస్లింకు సీఏఏతో ఎలాంటి నష్టం లేదన్నారు. అయోధ్యలో రామమందిరం నిర్మిస్తారని ఎవరూ ఊహించలేదని..కానీ, మోడీ మోడీ చెబితే.. చేస్తారనడానికి ఇదే నిదర్శనమని ఆయన వ్యాఖ్యానించారు. సిద్ధాంతం ఉన్న పార్టీ బీజేపీ అని చెప్పారు. కొన్ని పార్టీలు అవసరాలకు అనుగుణంగా సిద్ధాంతాలు మార్చుకుంటాయని విమర్శించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+