Graduate MLC: పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా ప్రేమేందర్ రెడ్డిని ప్రకటించిన బీజేపీ..

బీజేపీ పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిని ప్రకటించింది. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి పేరును ఖరారు చేసింది. మేరకు పార్టీ ప్రకటన విడుదల చేసింది. కాంగ్రెస్ నుంచి జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న పోటీ చేస్తున్నారు. బీఆర్ఎస్ ఏనుగల రాకేష్ రెడి బరిలో నిలుస్తున్నారు. తీన్మార్ మల్లన్న ఇప్పటికే నామినేషన్ దాఖలు చేశారు. ప్రస్తుతం ప్రచారంపై దృష్టి పెట్టారు.

పట్టభద్రల ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ మే 2న ప్రారంభమైంది. నామినేషన్లు దాఖలు చేయడానికి మే 9 చివరి తేదీగా ఉంది. మే 13 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడవు ఉంది. మే 27 పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ నిర్వహించనున్నారు. జూన్ 5 ఫలితాలు ప్రకటించనున్నారు. ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపును ప్రాధాన్యత క్రమంలో లెక్కిస్తారు. పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ మొదటి ప్రాధాన్యత వచ్చిన అభ్యర్థి గెలిచినట్లుగా ప్రకటిస్తారు.

BJP has announced the name of Premender Reddy as the graduate MLC candidate

పోలైన ఓట్లలో 50 శాతం కంటే ఎక్కువ రాకుంటే.. రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం పట్టభద్రుల స్థానానికి 2021 మార్చిలో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి తీన్మార్ మల్లన్నపై విజయం సాధించారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జనగామ నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలుపొందారు. దీంతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు.

ఈ ఎమ్మెల్సీ పదవి కాలం 2027 వరకు ఉంటుంది. గత ఎన్నికల్లో కూడా బీజేపీ నుంచి ప్రేమేందర్ రెడ్డి పోటీ చేశారు. ఈ ఎన్నికలను కాంగ్రెస్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. తన అభ్యర్థిని గెలుపించుకునేందుకు కృషి చేస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+