BJP: స్థానిక సంస్థల్లో సత్తా చాటేందుకు బీజేపీ ప్లాన్.. !

బీజేపీ తెలంగాణ క్రమంగా బలపడుతోంది. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కేవలం ఒక్క సీటు సాధించిన బీజేపీ ఆ తర్వాత రెండు అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికలో సత్తా చాటింది. మునుగోడు ఉప ఎన్నికలో కూడా గట్టి పోటీ ఇచ్చింది. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో కూడా మంచి పనితీరు కనబర్చింది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కూడా బీజేపీ కాస్త పుంజుకుంది. 8 చోట్ల విజయం సాధించింది. తాజాగా జరిగిన లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ భారీగా పుంజుకుంది. ఏకంగా 8 స్థానాలు గెలుచుకుంది. కాంగ్రెస్ 8 చోట్ల విజయం సాధించగా.. ఎంఐఎం ఒక స్థానంలో గెలుపొందింది.

బీఆర్ఆఎస్ మాత్రం లోక సభ ఎన్నికల్లో చతికిలపడింది. ఒక్క సీటు కూడా సాధించలేదు. అయితే తెలంగాణలో బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయంగా ఎదగాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది. బీఆర్ఎస్ స్థానంలో బీజేపీ రావాలంటే.. స్థానిక సంస్థ ఎన్నికల్లో కూడా బీజేపీ సత్తా చాటాలి. అలా జరిగితే తెలంగాణ బీఆర్ఎస్ కథ ముగిసినట్లు భావించవచ్చు. అయితే స్థానిక సంస్థల్లో బీజేపీ విజయం సాధించడం అంత సులువు ఏం కాదు. లోక్ సభ ఎన్నికల్లో మోదీ పేరుతో ప్రజల్లోకి వెళ్లి విజయం సాధించింది. కానీ స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇలా ఉండదు.

BJP has set a target of winning 50 percent seats in local body elections

అందుకే 50 శాతానికి పైగా స్థానాల్లో గెలవాలని పార్టీ లక్ష్యంగా పెట్టుకుని ప్లాన్ వేస్తోంది. రాష్ట్రంలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి ఇతర పార్టీల నుంచి చేరికలను ప్రోత్సహించాలని బీజేపీ యోచిస్తోంది. బీఆర్ఎస్ అధికారం కోల్పోవడంతో ఆ పార్టీ నుంచి వలసలు భారీగా ఉండే అవకాశాలున్నాయని భావిస్తోంది. గతంలో బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలకు పలువురు గులాబీ నేతలతో ఇంకా టచ్‌లో ఉన్నట్లు.. వారి ద్వారా ద్వితీయ శ్రేణి నేతలను పార్టీలో చేర్చుకోవాలని బీజేపీ ప్లాన్ చేస్తోంది.

మరోవైపు బీజేపీ జాతీయ నాయకత్వం తెలంగాణ బీజేపీలో మార్పులు చేయాలని చూస్తోంది. రాష్ట్రం నుంచి కిషన్ రెడ్డి, బండి సంజయ్ మంత్రి పదవులు వచ్చాయి. దీంతో రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న కిషన్ రెడ్డి అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పించే అవకాశం ఉంది. బీజేపీ అధ్యక్షుడిగా బలమైన బీసీ నేత, ఉద్యమ నేత, మంచి పేరున్న ఈటల రాజేందర్ నియమించే అవకాశం కనిపిస్తోంది. ఈటలకు పోటీగా రఘునందన్ రావు, డీకే అరుణ, ధర్మపురి అర్వింద్ అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్లు తెలుస్తోంది. త్వరలోనే బీజేపీ కొత్త అధ్యక్షుడిని నియమించే అవకాశం ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+