ఎన్నికల వేళ రాజాసింగ్ కు బిగ్ రిలీఫ్ - పోటీకి లైన్ క్లియర్..!!
తెలంగాణ ఎన్నికల వేళ బీజేపీ వరుస నిర్ణయాలు తీసుకుంటోంది. బీజేపీ అభ్యర్దుల ఎంపిక పైన సుదీర్ఘ కసరత్తు చేస్తున్న పార్టీ నాయకత్వం ఈ రోజు తొలి జాబితా విడుదలకు సిద్దమవుతోంది. ఇప్పటికే అభ్యర్దులకు పార్టీ నేతలు ఫోన్ చేసి సీటు ఖరారు అయిన అంశం చెబుతున్నారు. ఇప్పటి వరకు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తిరిగి పోటీ చేసేందుకు అవకాశం వస్తుందా లేదా అనే చర్చ నేపథ్యంలో బీజేపీ కీలక నిర్ణయం తీసుకుంది.
సస్పెన్షన్ ఎత్తివేత: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన బీజేపీ నాయకత్వం సస్పెన్షన్ ఎత్తివేసింది. గత ఏడాది వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో రాజాసింగ్ పైన పార్టీ సస్పెన్షన్ విధించింది. ఆ వ్యాఖ్యల కేసులో కేసు నమోదు కావటంతో రాజాసింగ్ జైలుకు వెళ్లారు. ఆ తరువాత రాజాసింగ్ పైన పార్టీ సస్పెన్షన్ ఎత్తివేత అంశం పైన పలు సందర్భాల్లో చర్చ సాగింది.

రాజాసింగ్ ఆ వ్యాఖ్యల పైన పార్టీ నేతలకు వివరణ ఇచ్చారు. సస్పెన్షన్ ఎత్తివేయాలని కోరుతూ రాజాసింగ్ సతీమణి పార్టీ నేతలకు లేఖలు రాసారు. ఇక, ఇప్పుడు ఎన్నికల సమయంలో పార్టీ సస్పెన్షన్ ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకుంది. 2018 ఎన్నికల్లో రాజాసింగ్ ఒక్కరే బీజేపీ ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యారు.2014, 2018 ఎన్నికల్లో వరుసగా రెండు సార్లు రాజాసింగ్ ఎమ్మెల్యేగా గెలుపొందారు.
గోషామహల్ నుంచి పోటీ: ఇప్పుడు సస్పెన్షన్ ఎత్తివేయటంతో రాజాసింగ్ మరోసారి గోషామహల్ నుంచి పోటీకి లైన్ క్లియర్ అయింది. ఈ రోజు పార్టీ ప్రకటించే తొలి జాబితాలోనే రాజాసింగ్ పేరు ఖాయమని తెలుస్తోంది. రాజాసింగ్ పైన సస్పెన్షన్ ఎత్తివేయకంటే విక్రమ్ గౌడ్ పార్టీ అభ్యర్దిగా బరిలో ఉంటారని భావించారు. ఇక, ఇప్పుడు రాజాసింగ్ పార్టీ అభ్యర్దిగా బరిలో నిలవనున్నారు. ఇక.. బీజేపీ తొలి జాబితా విడుదలపై సందిగ్ధత కొనసాగుతోంది.
మొదటి జాబితాపై ముఖ్యనేతల మధ్య ఏకాభిప్రాయం కుదరనట్లు తెలియవచ్చింది. కీలక నేతలు అలకపూనడంతో మొదటి జాబితా విడుదల ఆగినట్లు సమాచారం.తమకు కేటాయించిన నియోజకవర్గాలను పలువురు సీనియర్లు మర్చమంటున్నారు. దీంతో కీలకనేతలు అడిగిన స్థానాలను అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. ఈ క్రమంలో ఆఖరిక్షణంలో మొదటి జాబితా విడుదల నిలిచిపోయింది.

తొలి జాబితా సిద్దం: సీనియర్లను ఇంచార్జ్‌లు జవడేకర్, సునీల్ బన్సల్ బుజ్జిగిస్తున్నారు. అభ్యంతరం లేని నియోజకవర్గ నేతలకు నేరుగా ఫోన్లు చేసి టికెట్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నారు. సీనియర్లు దారికొస్తే.. ఏ క్షణమైనా బీజేపీ ఫస్ట్ లిస్ట్ విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. అటు జనసేనతోనూ పొత్తు ఖాయమైనట్లు సమాచారం. పార్టీ ఈ పొత్తు విషయాన్ని అధికారికంగా నిర్దారించాల్సి ఉంది.
జనసేనకు ఎన్ని సీట్లు ఇస్తారనేది ఇప్పుడు స్పష్టత రావాల్సి ఉంది. హైదరాబాద్ నగరంతో పాటుగా ఖమ్మం జిల్లాలో జనసేనకు సీట్లు ఇస్తారని చెబుతున్నారు. జనసేనతో పొత్తు..సీట్ల వ్యవహారంతో పాటుగా పార్టీ అభ్యర్దుల తొలి జాబితా ఈ రోజు బీజేపీ అధికారికంగా ప్రకటించేందుకు కసరత్తు జరుగుతోంది.
-
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్! -
వాస్తు ప్రకారం ఇంటి ముఖ ద్వారం వద్ద ఈ తప్పులు అస్సలు చెయ్యొద్దు -
బంగారం ధరలు రివర్స్ గేర్ -
AP Property Tax : ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-తాజా ఉత్తర్వులు..! -
నల్లగా పుట్టడం తప్పా.. నరేష్‌తో అక్రమ సంబంధం - జబర్దస్త్ నటి -
అమెరికా ఆధీనంలో పాకిస్తాన్ రాజధాని -
సూపర్ స్టార్ రజినీకాంత్ "జైలర్ 2"లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. -
ఏపీలో ఉచిత గ్యాస్ సిలెండర్ల లబ్దిదారులకు సర్కార్ గుడ్ న్యూస్..!












Click it and Unblock the Notifications