అంతర్గత విభేదాలతో బీజేపి అల్లకల్లోలం.!ఆరు నెలల ముందుగానే పసిగట్టిన వన్ ఇండియా.!
హైదరాబాద్ : తెలంగాణ బీజేపి లో చిత్రవిచిత్ర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ఏమయ్యిందో, ఎక్కడ మోదలయ్యిందో, ఎవరు శ్రీకారం చుట్టారో తెలియదు కానీ పార్టీ మాత్రం తీవ్ర సంక్షోబాన్ని ఎదుర్కొంటోంది. ముందుస్తుగా నిర్ణయించుకున్న కార్యక్రమాలు కూడా రద్దవ్వడం, జాతీయ నేతల బహిరంగ సభలు అకస్మాత్తుగా రద్దవ్వడం, పునఃప్రారంభం అవుతుందనుకున్న బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర గాడిన పడకపోవడం వంటి కార్యక్రమాలతో క్యాడర్ మొత్తం నిరుత్సాహపడుతున్నట్టు తెలుస్తోంది. తాజాగా నేతల మద్య నెలకొన్న విభేదాలతో పార్టీ అతలాకుతలం అవుతున్న పరిణామాలు తలెత్తాయి.
కొత్త అభ్యర్థికి పార్టీ పగ్గాలు..
ప్రధానంగా బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ కుమార్ ను పదవినుండి తప్పించి కొత్త అభ్యర్థికి పార్టీ పగ్గాలు కట్టబెడతారనే ఊహాగానాలు తారాస్దాయిలో నడుస్తున్నాయి. అంతే కాకుండా పార్టీ కీలక నేతలు విజయ శాంతి, డికే అరుణ, ఈటల రాజేందర్, రఘునందన్ రావు, కిషన్ రెడ్డి, డాక్టర్ కే లక్ష్మణ్, కోమటి రెడ్డి వెంకట రెడ్డి, వివేక్ వెంకటస్వామి ఎవరి ఇష్టానుసారం వారు వ్యవహరిస్తుండడం కూడా పార్టీలో మింగుడుపడని వ్యవహారంగా మారింది. నేతల మద్య సఖ్యత లేకుండా పరస్పర ఆరోపణలు కూడా పార్టీ ప్రతిష్టతకు శరాఘాతంలా పరిణమించాయి.

నివురుగప్పిన నిప్పులా తెలంగాణ బీజేపి..
తెలంగాణ బీజేపిలో ఇలాంటి పరిస్ధితిలు నివురుగప్పిన నిప్పులా ఉన్నాయని వన్ ఇండియా తెలుగు ఆరునెలల ముందుగానే పసిగట్టింది. పార్టీ అంతర్గత వ్యవహారాల పట్ల దృష్టి సారించి వాస్తవాలను వెలికి తీసే ప్రయత్నం చేసింది వన్ ఇండియా. వన్ ఇండియా చేసిన పరిశోదనలో బండి సంజయ్ పదవికి ప్రమాదం పొంచి ఉందని, నేతల మద్య విభేదాలు చాప కింద నీరులా పరిణమించాయని వన్ గుర్తించింది. అవే అంశాలతో కూడిన విశ్లేషణను జనవరి 30, 2023న అంటే ఆరు నెలల ముందుగానే వార్తను ప్రచురించింది. ఇప్పుడు వన్ ఇండియా చెప్పిన పరిణామాల చుట్టే తెలంగాణ బీజేపి రాజకీయం అడుగులు వేస్తుంది.
వన్ ఇండియా ముందస్తు అంచనా..
అంతే కాకుండా బీజేపి ఛీఫ్ కు ప్రమాద ఘంటికలు.!అధిష్టానం టచ్ లో ఆ ఉద్యమ నేత.!"సన్ స్ట్రోక్" ప్రభావమేనా.?అనే టైటిల్ తో ఆరు నెలల ముందుగానే బీజేపిలో జరుగుతున్న వ్యవహారాలను అంచనా వేసింది వన్ ఇండియా.ఇప్పుడు అచ్చం అవే పరిస్థితులు బిజేపి లో చోటుచేసుకుంటున్నాయి. అద్యక్ష పదవి మార్పుగురించి స్వయంగా బండి సంజయ్ కుమార్ స్పందిండం ఈ ఎపిసోడ్ లో కొసమెరుపు.
ఆరు నెలల క్రితం వాస్తవాన్ని విశ్లేషించిన వన్ ఇండియా..
ఢిల్లీ వేదికగా తెలంగాణ రాజకీయం వాడివేడిగా కొనసాగుతున్న తరుణంలో రఘునందన్ రావు వ్యాఖ్యలు మరింత అగ్గిని రాజేసాయి. ఇలాంటి పరిస్ధితిలో మరో నాలుగు రోజుల్లో ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభను వరంగల్ నిర్వహించేందుకు తెలంగాణ బీజేపి సన్నాహాలు చేస్తుంది. నేతల మద్య నెలకొన్న విభేదాలు ఈ సభ విజయవంతం పట్ల ఏ మేరకు ప్రభావం చూపుతాయనే అంశంపై మాత్రం సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.
-
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565












Click it and Unblock the Notifications