కేఏ పాల్ భుజంపై కేసీఆర్‌కు తుపాకీ గురిపెట్టిన బీజేపీ?
ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. ఇటీవలే ఆయన కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిశారు. రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా తెలంగాణలో కమలం జెండాను రెపరెపలాడించాలనే పట్టుదలతో ఉన్న బీజేపీ పెద్దలు అందుకు అనుగుణంగా పావులు కదుపుతున్నారు. అందివచ్చిన ఏ అవకాశాన్ని వదలడంలేదు. తాజాగా కేఏ పాల్ ద్వారా అధికార పార్టీ ఓట్లు చీల్చడానికి వ్యూహం పన్నారు.

అడిగిన వెంటనే అమిత్ షా అపాయింట్‌మెంట్
సిరిసిల్లలో తనపై దాడి జరిగిందని చెప్పడానికి అపాయింట్ కోరగానే అమిత్ షా ఇచ్చేశారు. దీన్నిబట్టి కేఏపాల్‌ద్వారా తెలంగాణ రాజకీయాన్ని బీజేపీ మలుపు తిప్పబోతోందని స్పష్టమవుతోంది. రాజకీయాలు కాకుండా ఆధ్యాత్మికంగా ఆయన చేసే ప్రసంగాలకు మంచి క్రేజ్ ఉంది. పాల్ ద్వారా నియోజకవర్గానికి 500 ఓట్లు చీలినా ఉపయోగపడతాయనే భావనలో ఉన్న బీజేపీ పెద్దలు కేఏ పాల్‌పై దృష్టి పెట్టారు.

రాజకీయ సమావేశం కాదు.. దైవజనుల సమావేశం
బేగంగపేటలోని చికోటి గార్డెన్ లో ఈరోజు పాస్లర్లతో సమావేశం నిర్వహించాల్సి ఉంది. అయితే ఈ సమావేశానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదని, ఏ క్షణానైనా పాల్‌ను అరెస్ట్ చేస్తారంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. దీంతో పాల్ అనుచరులు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. స్పందించిన పాల్.. ఇది రాజకీయ సమావేశం కాదని, దైవజనుల సమావేశమని, ఈ హాల్‌ను 15 రోజుల క్రితమే బుక్ చేసుకున్నామని, ఈ సమావేశానికి పోలీసుల అనుమతి అవసరం లేదన్నారు. అయితే తాను హాజరైతే మాత్రం అనుమతి తీసుకోవలనడంపై ఆయన మండిపడ్డారు.

టీఆర్ ఎస్ ప్రభుత్వం కిరాయి గూండాలను ఉపయోగించుకుంటోంది
సిరిసిల్లలో తనపై దాడిచేసిన వ్యక్తిని ఇంతవరకు ఎందుకు అరెస్ట్ చేయలేదని ప్రశ్నించారు. పోలీసులను, కిరాయి గూండాలను ఉపయోగించుకొని టీఆర్ ఎస్ ప్రభుత్వం సమావేశాన్ని అడ్డుకోవాలని చూడటం సిగ్గుచేటన్నారు. ఎన్ని అడ్డంకులు కల్పించినా ఈ సమావేశం జరిగితీరుతుందని, తాను హాజరవుతానని స్పష్టం చేశారు.












Click it and Unblock the Notifications