Telangana Assembly Elections 2023: ఒక్కొక్కరిపై ఒక్క లక్ష ఇరవై వేల అప్పు.. బండి సంజయ్..
దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానని దొంగమాటలు చెప్పిన కేసీఆర్ అధికారంలోకి వచ్చిన తర్వాత తాగుడు, ఊగుడు, పండుడే అనే నైజాంతో ఉన్నాడని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ అన్నారు. బండి సంజయ్ నిర్మల్ జిల్లా ముథోళ్ నియోజకవర్గంలోని భైంసా పట్టణంలో జరిగిన సభలో పాల్గొన్నారు. బీజేపీ రామారావు పటేల్ గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ మాజీ సీఎం అవ్వడం ఖాయమని జోస్యం చెప్పారు.
బీఆర్ఎస్, కాంగ్రెస్ కి అధికారం కట్టబట్టినట్లయితే రాష్ట్రాన్ని మరో భైంసాల తయారు చేస్తారని అన్నారు. ఇక్కడి బీజేపీ అభ్యర్థి రామారావు పటేల్ ఇప్పటికీ నవ యువకుడిలా పోరాడుతున్నారని చెప్పారు. ఎంతో మంది త్యాగాల వల్ల తెలంగాణ సాధించుకున్నామని బండి సంజయ్ గుర్తు చేశారు. ఆనాడు సుష్మా స్వరాజ్ ఒత్తిడితో తెలంగాణ వచ్చిందని అంతేకానీ కేసీఆర్ దొంగ దీక్ష తో తెలంగాణ రాలేదని తెలిపారు. ప్రతి ఒక్క పార్టీ పథకాలు, హామీలు ఇస్తాం అని చెప్పడం తప్ప తెలంగాణపై ఉన్నటువంటి అప్పునేలా తీరుస్తారని చెప్పడం లేదని ఎద్దేవా చేశారు.

ఇప్పటికే రాష్ట్రంలో ఒక్కొక్కరిపై ఒక్క లక్ష ఇరవై వేల అప్పువుందని గుర్తు చేశారు. రాష్ట్రాన్ని అప్పుల కుప్పల నుంచి గట్టెకించే పార్టీ బీజేపీనే అని అన్నారు. రాష్ట్రం లో కాంగ్రెస్ తో గెలిచిన అభ్యర్థులు బీఆర్ఎస్ లోకి వెళ్లడం ఖాయమన్నారు. రామారావు పటేల్ గెలిచాక ముధోల్ తాలూకా అభివృద్ధి కోసం తాలుకాని దత్తత తీసుకుంటానని హామీ ఇచ్చారు. కేంద్ర నిధులతో అభివృద్ధి చేస్తానని బండి సంజయ్ స్పష్టం చేశఆరు.
దేశంలో బీజేపీ పార్టీ అధికారంలోకి వచ్చాక అస్సలు మతవిద్వేషాలు చలారేగలేదని చెప్పారు. గతంలో భైంసా అల్లర్లలో హిందూ సమాజం బాగా నష్టపోయిందని బండి సంజయ్ గుర్తు చేశారు. హిందూ సమాజానికి అండగా ఉన్నటువంటి ధర్మరక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. రానున్న రోజుల్లో బైంసా లో ప్రతి ఇంటి నుండి ఒక శివాజీ, ఝాన్సీ లక్ష్మీబాయిలా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. బీసీ ముఖ్యమంత్రిని ప్రకటించిన ఘనత,ఎస్సీ వర్గీకరణ కమిటీ బీజేపీ తోనే సాధ్యమన్నారు.












Click it and Unblock the Notifications