హైదరాబాద్‌లో బీజేపీ రాష్ట్ర నేత ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్
హైదరాబాద్: జనగామ జిల్లాకు చెందిన భారతీయ జనతా పార్టీ నేత ముక్కెర తిరుపతి రెడ్డి కిడ్నాప్ అయ్యారు. హైదరాబాద్ నగరంలోని అల్వాల్‌లో తన భర్తను అపహరించినట్లు ఆయన భార్య సుజాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన భూమిని కబ్జా చేసేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని ఫిర్యాదులో ఆమె పేర్కొన్నారు. కాగా, తిరుపతి రెడ్డి బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఉన్నారు.
అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. కుషాయిగూడలో నివసించే ముక్కెర తిరుపతి రెడ్డి రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓల్డ్ అల్వాల్ పాకాలకుంటలో రూ. కోట్లు విలువ చేసే స్థలం ఉంది. కొన్ని నెలల క్రితం స్థలంపై వివాదం నెలకొనడంతో ఆయన పోలీసు ఉన్నతాధికారులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో గురువారం మధ్యాహ్నం తిరుపతి రెడ్డి కారులో డ్రైవర్‌తో కలిసి అల్వాల్ మండల తహసీల్దార్ కార్యాలయానికి వచ్చారు. డ్రైవర్ పని మీద బయటకు వెళ్లి తిరిగి వచ్చే సరికి తిరుపతి రెడ్డి అక్కడ కనిపించకుండా పోయారు. అతడి రెండు ఫోన్లు రెండు ఫోన్లు స్విచ్ఛాఫ్‌లో ఉన్నాయి. దీంతో ఆయన భార్య సుజాత అల్వాల్ పోలీసులకు గురువారం రాత్రి ఫిర్యాదు చేశారు.
స్థల వివాదంతో ప్రత్యర్థి వర్గంలోని వ్యక్తులే తన భర్తను కిడ్నాప్ చేశారని ఫిర్యాదులో సుజాత పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. బీజేపీ నేత కావడంతో తిరుపతి రెడ్డి కిడ్నాప్ వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు, కొద్ది రోజుల క్రితం భూ వివాదంలో కిడ్నాప్ అయిన తర్వాత హత్యకు గురైన రిటైర్డ్ ఎంపీడీవో రామకృష్ణయ్య.. ప్రస్తుతం కిడ్నాపైన తిరుపతి రెడ్డి.. ఒకే మండలానికి చెందినవారు కావడంతో ఈ కిడ్నాప్ వ్యవహారం ప్రాధాన్యత సంతరించుకుంది.
-
ఏప్రిల్ రెండో వారంలో తెలంగాణాకు ప్రధాని మోదీ.. బీజేపీ బిగ్ ప్లాన్ ఇదే! -
HRA: హైదరాబాద్ లో ఉండే వారికి భారీ గుడ్ న్యూస్, ఏప్రిల్ 1 నుంచే.. -
రంజాన్ స్పెషల్ స్వీట్ "డబుల్ కా మీటా" ఇలా ట్రై చేస్తారా..? -
40 ఏళ్లలో లేని అతిపెద్ద పసిడి పతనం. 1983 సీన్ రిపీట్! -
పాతాళానికి బంగారం ధరలు- రంజాన్ పండగ వేళ -
తమిళనాడులో ఆ పార్టీదే అధికారం: విజయ్ రాకతో మారిన ఈక్వేషన్లు -
రేషన్ లబ్దిదారులకు కేంద్రం గుడ్ న్యూస్- మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
మేషరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, ధనుస్సు రాశులకు ఏప్రిల్ నెలలో రాజయోగం -
బంగాళాఖాతంపై ఆవర్తనం- ఏపీలోని ఈ జిల్లాల్లో భారీ వర్షాలు -
తులారాశి వార్షిక ఫలం 2026-27: ఈ ఏడాది వీరికి తిరుగేలేదు.. ఈ విషయంలో జాగ్రత్త! -
త్వరలో తిరుపతి, హైదరాబాద్‌కు నేరుగా రైళ్లు: ఆ జిల్లాకు కేంద్రమంత్రి తీపికబురు!












Click it and Unblock the Notifications