BJP First List: తెలంగాణ బీజేపీలో ప్రకంపనలు.. అసంతృప్తితో ఆ ఇద్దరు నేతలు..!
బీజేపీ అధిష్ఠానం శనివారం 195 మందితో మొదటి జాబితా ప్రకటించింది. తెలంగాణకు సంబంధి 9 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో ఈటల రాజేందర్, బండి సంజయ్, ధర్మపురి అర్వింద్, కిషన్ రెడ్డి, కొండ విశ్వేశ్వర్ రెడ్డి, బూర నర్సయ్య గౌడ్, బీబీ పాటిల్, భరత్, మాధవి లత ఉన్నారు. బీజేపీ నలుగురు సిట్టింగ్ ఎంపీల్లో ముగ్గురు సీట్ కన్ఫమ్ చేసింది. కానీ ఆదిలాబాద్ ఎంపీ సోయం బాపూరావు పేరును మాత్రం ప్రకటించలేదు.
దీనిపై సోయం బాపూరావు స్పందించారు. తనకు టికెట్ రాకుండా కొంత మంది తమ పార్టీ వారే అడ్డుకుంటున్నారని చెప్పారు. తనకు టికెట్ రాకుండా ఓ అగ్రనేత ప్రయత్నిస్తున్నారు బాపూరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివాసీ నేతనైనా తనకు టికెట్ దక్కకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తాను కొమ్మపై ఆధారపడిన పక్షిని కాదని రెక్కల మీద ఆధారపడిన పక్షిని అన్నారు. 2019లో టికెట్ తీసుకోమ్మంటే పరిపోయిన వారు మళ్లీ టికెట్ కోసం యత్నిస్తున్నారని చెప్పారు.

తన లోక్ నియోజకవర్గంలో నలుగురు ఎమ్మెల్యేలను గెలిపించానని బాపూరావు చెప్పారు. తన బలం, బలగం కావాలనుకుంటే పార్టీ టికెట్ ఇస్తుందన్నారు. తన పేరు రెండో లిస్ట్‌లో తనకు టికెట్ వస్తుందని భావిస్తున్నట్లు చెప్పారు. టికెట్ రాకుంటే తన దారి తాను చూసుకుంటనని అన్నారు. అటు మాల్కజిగిరి టికెట్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేసిన మురళీధర్ రావు పార్టీ అధిష్ఠానంపై అసహనంతో ఉన్నట్లు తెలుస్తోంది.
మాల్కజిగిరి టికెట్ కోసం మురళీధరా రావు, ఈటల రాజేందర్ తీవ్రంగా పోటీ పడ్డారు. అధిష్ఠానం మాత్రం ఈటలకే టికెట్ ఇచ్చింది. దీంతో అసహనానికి గురైన మురళీధర్ రావు ఓ ట్వీట్ చేశాడు. " మల్కాజ్‌గిరిలో నా కోసం పనిచేసిన అందరికీ ధన్యవాదాలు. త్వరలోనే నా అనుచరులను, కార్యకర్తలను వ్యక్తగతంగా కలుస్తా. ఆపై భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తా" అని ట్వీట్ చేశారు.












Click it and Unblock the Notifications