హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రైతుల మెడకు సర్వీస్ చార్జీల మోత ; కట్టకపోతే కరెంట్ కట్..!! కేసీఆర్‌పై విజయశాంతి ఫైర్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ సీనియర్ నాయకురాలు విజయశాంతి విరుచుకుపడ్డారు. రైతుల జీవితాలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆటలాడుతున్నారని మండిపడ్డారు. పండిన పంటను గిట్టుబాటు ధర కల్పించడం లేదని దుయ్యబట్టారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని పైకి టీఆర్ఎస్ ప్రభుత్వం గొప్పలు చేప్పుకుంది. కానీ వాస్త‌వంగా రైతుల‌ను నిలువునా దోచుకుంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతుల నుంచి సర్వీస్ చార్జీల పేరుతో డబ్బులు వసూలు చేస్తోందని ఫైర్ అయ్యారు.

స‌ర్వీస్ చార్జీ క‌ట్ట‌ని మోట‌ర్ల‌కు ప‌వ‌ర్ క‌ట్

స‌ర్వీస్ చార్జీ క‌ట్ట‌ని మోట‌ర్ల‌కు ప‌వ‌ర్ క‌ట్


రైతులు సర్వీస్ చార్జీలు కట్టలేదని జోగులాంబ గద్వాల జిల్లాలోనే నాలుగు మండలాల్లో 50 ట్రాన్స్ ఫార్మర్లకు కరెంట్ కట్ చేశారని రాములమ్మ మండిపడ్డారు. ప‌వ‌ర్ క‌ట్‌తో వ్యవసాయ మోటర్ల కింద సాగుచేసుకుంటున్న వంద‌ల ఎక‌రాల్లో పంటల ఎండిపోయే పరిస్థితి వచ్చింది. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వంత జిల్లాలో కూడా ఇదే ప‌రిస్థితి అని దుయ్య‌బ‌ట్టారు. గజ్వేల్, ములుగు, వర్గల్, మర్కూక్ మండాలాల‌ పరిధిలో కూడా గత మూడు రోజులుగా ట్రాన్స్ ఫార్మర్లకు ప‌వ‌ర్ కట్ చేశారని ఫైర్ అయ్యారు. సంగారెడ్డి జిల్లాలో వ్యవసాయ మోటర్ల వద్ద ఉన్న స్టార్టర్లను విద్యుత్ అధికారులు ఎత్తుకెళ్లారు. రైతుల పట్ల ఇంతటి దుర్మార్గంగా కేసీఆర్ ప్రభుత్వం వ్యవహరిస్తోందని విరుచుకుపడ్డారు.

స్టార్టర్లను పట్టుకెళ్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది

స్టార్టర్లను పట్టుకెళ్తున్న ట్రాన్స్‌కో సిబ్బంది


గతంలో పొలాల్లో తిరుగుతూ స్టార్టర్లు పీకెళ్లేవారు. కానీ ఇప్పుడు ఏకంగా ట్రాన్స్‌పార్మ‌ర్లకు కరెంట్ కట్ చేస్తూ రైతుల పట్ల ట్రాన్స్ కో ఆఫీసర్లు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ కావడం వలనే తాము ఎలాంటి బిల్లులు కట్టలేదని రైతులు చెబుతున్నారు. విద్యుత్ అధికారులు మాత్రం ఇలా ట్రాన్స్‌పార్మర్లకు ప‌వ‌ర్ బంద్ పెట్టడంతో తమ పంటలు ఎండుతున్నాయని వాపోతున్నారు. అప్పులు చేసి పంటలు పండించుకుంటే అధికారులు నిర్దాక్షిణ్యంగా కరెంట్ కరెంట్ కట్ చేస్తున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అన్ని జిల్లాల్లో ట్రాన్స్‌కో సిబ్బంది వ్యవసాయ బావుల వద్దకు వెళ్లి స్టార్టర్లను పట్టుకెళ్తున్నారు. సర్వీస్ చార్జీలు కడితేనే తిరిగి ఇస్తామంటూ వెళ్లిపోతున్నారని రాములమ్మ పేర్కొన్నారు.

స‌ర్వీస్ చార్జీ సంగ‌తే తెలియ‌దు..

స‌ర్వీస్ చార్జీ సంగ‌తే తెలియ‌దు..


కేసీఆర్ ప్రభుత్వం వ్యసాయానికి ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతున్నా.. ట్రాన్స్‌కో మాత్రం రైతుల నుంచి సర్వీస్ చార్జీల కింద నెలకు రూ. 30 చొప్పున వసూలు చేస్తోందని విజయశాంతి మండిపడ్డారు. ప్రభుత్వం ఉచిత కరెంట్ ఇస్తుంటే .. తాము ఈ సర్వీస్ చార్జీలు ఎందుకు కట్టాలని రైతులు ప్రశ్నిస్తున్నారని తెలిపారు. అసలు సర్వీసు చార్జీల సంగతే తమకు తెలియదని రైతులు పేర్కొంటున్నారు. ఈ సంగతి తెలియక సర్వీస్ చార్జీలు కట్టకపోవడంతో ఎన్నో ఏండ్లుగా బకాయిలు పేరుకుపోయాయి.

Recommended Video

CM KCR Behaving Like A Dictator - Vijayashanti | Telangana | Oneindia Telugu
రైతుల‌ను ద‌గా చేస్తున్న కేసీఆర్

రైతుల‌ను ద‌గా చేస్తున్న కేసీఆర్


ఒక్కసారిగా పెద్దమొత్తంగా కట్టాలంటే తమ దగ్గర అంత డబ్బులు లేవని రైతులు ఆవేదన చెందుతున్నారు. రైతులుసర్వీసు చార్జీలు కట్టపోతే అడగాలి కానీ ఇలా కరెంట్ కట్ చేయడం ఎంతవరకు సమజసం అని కేసీఆర్ ను విజయశాంతి నిలదీశారు. ఒక పక్క వడ్ల కొనుగోలు చేయమని రైతులను అయోమయంలో పడేసిన దొర ఇప్పుడు మొత్తానికే ఎసరు పెడుతున్నారని దుయ్యబట్టారు. రైతు జీవితాల‌లో ఆటలాడుకుంటున్న కేసీఆర్ సర్కార్ కు గుణపాఠం తప్పదని రాములమ్మ హెచ్చరించారు. రాష్ట్రం నుంచి టీఆర్ఎస్ పార్టీని సాగ‌నంపేందుకు ప్ర‌జ‌లు సిద్ధంగా ఉన్నార‌ని పేర్కొన్నారు.

English summary
BJP Vijayashanti fire on Telangana CM KCR
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X