రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం..!?
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ పై బీజేపీ హైకమాండ్ అనూహ్య నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కొద్ది రోజులుగా రాజాసింగ్ చేస్తున్న వ్యాఖ్యల పైన హైకమాండ్ ఆరా తీసింది. కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ చేసిన కామెంట్స్ పైన ఫిర్యాదులు అందాయి. దీంతో, అసలు రాజాసింగ్ వ్యాఖ్యల పైన నివేదిక కోరినట్లు సమాచారం. పార్టీలో నిర్ణయాల పైన చేస్తున్న వ్యాఖ్యల పైన హైకమాండ్ ఆగ్రహంగా ఉందని తెలుస్తోంది. దీంతో, రాజాసింగ్ పైన తమ నిర్ణయం ప్రకటించేందుకు బీజేపీ నాయకత్వం సిద్దమైనట్లు సమాచారం.
బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ శైలి పైన పార్టీ నాయకత్వం ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. పార్టీ అధినాయకత్వం క్రమశిక్షణ చర్యలు ప్రకటించేందుకు రంగం సిద్దమైంది. ఇప్పటికే పార్టీ రాష్ట్ర నాయకత్వం నుంచి నివేదిక కోరినట్లు పార్టీ నేతల సమాచారం. రాజాసింగ్ కొంత కాలంగా చేస్తున్న వ్యాఖ్యలు.. చోటు చేసుకుంటున్న పరిణామాల పైన పూర్తి నివేదిక రూపంలో పంపినట్లు పార్టీ నేతలు చెబుతున్నారు. పార్టీలో ఉన్న గ్రూపులు... ఎవరు సీఎంగా ఉంటే వారిని పార్టీలోకి నొందరు నేతలు రహస్యంగా కలుస్తున్నారని రాజాసింగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. తాజాగా హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా గౌతమ్‌రావును ప్రకటించడంపై రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు పార్టీలో వివాదాస్పదంగా మారాయి.

కేంద్ర మంత్రి.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి లక్ష్యంగా రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్లు భావిస్తున్నారు. రాజాసింగ్ వ్యాఖ్యల కారణంగా పార్టీ ఇమేజ్ డామేజ్ అవుతుందని కొందరు నేతలు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. దీంతో, రాజాసింగ్ పై పార్టీ నాయకత్వం సూచన మేరకు రాష్ట్ర నేతలు నివేదిక పంపారు.
ఈ నివేదిక ఆధారంగా హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశం ఉందని భావిస్తున్నారు. పార్టీ సీనియర్ ఎమ్మెల్యేగా రాజాసింగ్ అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్ పదవి ఆశించారు. అయితే, పార్టీ ఏలేటి మహేశ్వర్ రెడ్డిని నియమించారు. అప్పటి నుంచి గుర్రుగా ఉన్న రాజాసింగ్ పార్టీలో పరిణామాల పైన ఓపెన్ గానే మండిపడుతున్నారు. దీంతో, ఇప్పుడు రాజాసింగ్ విషయం లో పార్టీ నాయకత్వం తీసుకునే నిర్ణయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.












Click it and Unblock the Notifications