దర్భంగా పేలుళ్లు.. హైదరాబాద్,పాతబస్తీలపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు...
ఇటీవల బిహార్‌లోని దర్భంగా రైల్వే స్టేషన్‌లో జరిగిన పేలుడు మూలాలు హైదరాబాద్‌లో బయటపడటంపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తీవ్ర స్థాయిలో స్పందించారు. బిహార్‌లో పేలుళ్లు జరిగితే హైదరాబాద్‌లో అరెస్టులు జరిగాయని రాజాసింగ్ అన్నారు.హైదరాబాద్ నగరం నాటు బాంబులు తయారుచేసే ఫ్యాక్టరీగా మారిందన్నారు. హైదరాబాద్‌లో బాంబులు తయారుచేసి ఇతర రాష్ట్రాలకు పంపుతున్నారని... ఇంత జరుగుతున్నా రాష్ట్ర ఇంటలిజెన్స్ ఏం చేస్తోందని ప్రశ్నించారు.
దర్భంగా పేలుళ్ల నిందితులను హైదరాబాద్‌లో అరెస్ట్ చేయడంపై అసలు నిజాలు బయటకు రావాల్సిన అవసరం ఉందన్నారు. పాతబస్తీ పోలీసులు ఈ వ్యవహారాన్ని గోప్యంగా ఉంచుతున్నారని ఆరోపించారు. పాతబస్తీలో నాటు బాంబులు తయారుచేసే ఫ్యాక్టరీలు ఎన్నున్నాయో హోంమంత్రి మహమూద్ అలీ చెప్పాలని డిమాండ్ చేశారు. బాంబు పేలుళ్ల వెనుక రాజకీయ ప్రమేయంపై ఆరా తీయాలని... దాని వెనుక ఏ ఆర్గనైజేషన్ ఉన్నా బయటపెట్టాలని డిమాండ్ చేశారు.

ఈ ఈ నెల 17న దర్బంగా రైల్వే స్టేషన్‌లోని ఒకటో నెంబర్ ప్లాట్ ఫామ్‌పై పేలుడు సంభవించిన సంగతి తెలిసిందే. సికింద్రాబాద్ నుంచి వచ్చిన రైలు ప్లాట్‌ఫాం పైకి చేరుకోగా... ఓ వస్త్రాల వ్యాపారి పార్సిల్స్ దింపుతుండగా ఒక్కసారిగా పేలుడు జరిగింది. ఈ ఘటనలో ఎవరికీ గాయాలు కాలేదు. సీసీటీవీ ఫుటేజీ ద్వారా విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను ఉత్తర ప్రదేశ్‌కు చెందిన ఇమ్రాన్, నాసిర్‌లుగా గుర్తించారు.
హైదరాబాద్‌లోని ఆసిఫ్ నగర్‌లో వీరు బట్టల దుకాణం నడుపుతున్నట్లు గుర్తించారు. ఈ నెల 15న దర్బంగా రైల్లో వీరు వస్త్రాల పార్సిల్స్‌ను పంపించినట్లు నిర్దారించారు. సోమవారం(జూన్ 28) ఆ ఇద్దరు నిందితులతో పాటు మరో వ్యక్తిని హైదరాబాద్‌లో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) విచారణ జరుపుతోంది.
మరోవైపు ఈ ఘటనలో నిజానిజాలు నిర్దారించేందుకు సీపీఐ(ఎంఎల్) నేత్రుత్వంలోని ఎమ్మెల్యేల బృందం మంగళవారం(జూన్ 29) దర్బంగా రైల్వై స్టేషన్‌లోని పేలుడు జరిగిన ప్రాంతాన్ని పరిశీలించింది. ఎమ్మెల్యే మనోజ్ మంజిల్ మాట్లాడుతూ... ఘటనపై అక్కడి షాపుల యజమానులను వాకబు చేసినట్లు చెప్పారు. పేలుడు ఘటన గురించి చెప్పగా వినడమే తప్ప తామెవరం చూడలేదని వారు చెప్పినట్లు తెలిపారు. అంతేకాదు,మతాల మధ్య ఘర్షణ సృష్టించేందుకే దీన్ని తెరపైకి తీసుకొచ్చారని ఆరోపించారన్నారు.
-
క్యూర్, ప్యూర్, రేర్ అనే అనే మూడు ప్రాంతాలుగా తెలంగాణ: మూసీపై రేవంత్ కీలక ప్రకటన -
'ధురంధర్' యలీనా గుట్టురట్టు: నిజమా.. కల్పితమా? -
ఈ అరటి కాయల మధ్య ఉన్న పామును కనిపెట్టగలరా..? -
బంగారం ధరల అంచనాలు తలకిందులు -
తులా రాశి, వృశ్చిక రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
ఇరాన్ ను లేపేద్దాం రండి: ప్రపంచ దేశాలకు నెతన్యాహు పిలుపు -
మహేష్ బాబు కాకుండా ఆ హీరో అంటే చాలా ఇష్టం - కృష్ణ -
క్రికెట్ రాజకీయాలకు బలైన రియల్ లైఫ్ 'ధురంధర్' ఆదిత్య ధర్! -
విజయ్ సంచలనం.. టీవీకే అభ్యర్థుల ఫుల్ జాబితా విడుదల..












Click it and Unblock the Notifications