నాగార్జున వివాదంలోకి సమంత ఎంట్రీ
తెలంగాణ రాజకీయాల్లో ఎన్ కన్వెన్షన్ సెంటర్ హాట్ టాపిక్‌గా మారింది. ప్రముఖ సినీ నటుడు అక్కినేని నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ పై అధికారులు కొరడా ఝుళిపించారు. అక్రమంగా చెరువును అక్రమించి నిర్మించారని తేలడంతో ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను అధికారులు కూల్చివేశారు. నాగార్జున తుమ్మిడి చెరువులో మూడున్నర ఎకరాల భూమిని కబ్జా చేసి ఈ నిర్మాణం చేపట్టారని హైడ్రాకు ఫిర్యాదు అందడంతో భారీ బందోబస్తు నడుమ ఈ నిర్మాణాన్ని కూల్చివేశారు. ప్రభుత్వం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హైడ్రాకు ఈ నిర్మాణంపైనా ఫిర్యాదుల వచ్చాయి.
ఎన్ కన్వెన్షన్‌ను తాకుతూనే చెరువు నీళ్లు ఉంటాయి. దీంతో, ఈ నిర్మాణం కు సంబంధించి హైడ్రా పూర్తి వివరాలు సేకరించింది. ఈ రోజు ఎన్ కన్వెన్షన్ కూల్చివేత పనులు ప్రారంభించింది. తమ్మిడి చెరువులో 3 ఎకరాల 30 గుంటలను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ సెంటర్‌ను నిర్మించారని హైడ్రా గుర్తించింది. అయితే, నాగార్జునకు చెందిన నిర్మాణం కావటంతో అధికారులు కూల్చివేత వంటి సీరియస్ నిర్ణయాలు తీసుకుంటారా అనే సందేహాలు వ్యక్తం అయ్యాయి. అయితే, రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఎవ్వరినీ వదిలిపెట్టేది హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథన్ స్పష్టం చేశారు.

దీనిపై స్పందించిన నాగార్జున రేవంత్ రెడ్డి ప్రభుత్వం గచ్చిబౌలిలోని తన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ను అక్రమ కట్టడం పేరుతో కూల్చివేయడాన్ని అక్కినేని నాగార్జున తీవ్రంగా తప్పుబట్టారు. ఈ మేరకు హైడ్రా, తెలంగాణ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఓ ప్రకటన విడుదల చేశారు. ప్రభుత్వ చర్యలతో ప్రజలు తమను తప్పుగా అనుకోకుండా ఈ ప్రకటన చేస్తున్నట్లు తెలిపారు. చట్టవిరుద్ధంగా చేసిన కూల్చివేతపై కోర్టులోనే తేల్చుకుంటానని నాగార్జున వెల్లడించారు.స్టే ఆర్డర్‌లు, కోర్టు కేసులకు విరుద్ధంగా ఎన్ కన్వెన్షన్‌కు కూల్చివేతలు చేపట్టడం బాధాకరమని అక్కినేని నాగార్జున తన ప్రకటనలో తెలిపారు.
తాజాగా దీనిపై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు సంచలన కామెంట్స్ చేశారు. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బిఆర్ఎస్ పార్టీ ఎన్ కన్వెన్షన్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు అని ప్రశ్నించారు. ఎన్ కన్వెన్షన్ పై చర్యలు తీసుకుని చెరువు భూమిని గుర్తించాలని 2014 లో హై కోర్టు ఆదేశించింది. దీనిపై అప్పటి మంత్రి కేటీఆర్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. పదేళ్లు మౌనంగా ఉన్నారు. నాగార్జున మాజీ కోడలు సమంతని తీసుకువచ్చి తెలంగాణ చేనేత బ్రాండ్ అంబాసిడర్ గా నియమించారు. దాని వెనుక ఆంతర్యం ఏంటి అంటూ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనితో ఆయన ఈ వివాదంలోకి సమంతని కూడా లాగినట్లు అయింది.












Click it and Unblock the Notifications