బీజేపీ జాతీయకార్యవర్గ సమావేశాలు: మైలేజ్ తగ్గించేందుకు టీఆర్ఎస్ అష్టకష్టాలు: కేటీఆర్ వ్యూహం సక్సెస్ అవుతుందా?

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంపై బిజెపి అధినాయకత్వం ఫోకస్ పెట్టింది అన్న విషయం నిర్వివాదాంశం. అందులో భాగంగానే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్ వేదికగా జరుగుతున్నాయి. బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో రాష్ట్రానికి ప్రధాని నరేంద్ర మోడీ, హోం శాఖ మంత్రి అమిత్ షా, రాజ్ నాథ్ సింగ్ తదితర కేంద్ర మంత్రులతో పాటు, బిజెపి జాతీయ నాయకులు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్ లో రెండు రోజులపాటు ఉండనున్నారు.

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల మైలేజ్ కోసం బీజేపీ వ్యూహం

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల మైలేజ్ కోసం బీజేపీ వ్యూహం

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా ఫోకస్ అంతా బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాల పైనే ఉండనుంది. ఇప్పటికే కమలదళం బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు మైలేజ్ తీసుకురావడం కోసం అనేక ప్రయత్నాలు చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో వివిధ రాష్ట్రాలలో మంత్రులుగా పనిచేసిన కీలక నాయకులతో సమావేశాలు నిర్వహించి, పార్టీ శ్రేణుల్లో ఉత్తేజాన్ని నింపింది. అంతేకాకుండా జాతీయ కార్యవర్గ సమావేశాలను ప్రజలకు తెలిసేలా, ఎంతో ప్రతిష్టాత్మకంగా, ప్రత్యేకతను సంతరించుకునేలా రూపొందించింది.

బీజేపీ యత్నాలకు చెక్ పెట్టే పనిలో గులాబీ నేతలు

బీజేపీ యత్నాలకు చెక్ పెట్టే పనిలో గులాబీ నేతలు

మరోపక్క హైదరాబాద్ నగరాన్ని కాషాయమయం చేసి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ బిజెపి నేతలు జాతీయ కార్యవర్గ సమావేశాలపై పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ బిజెపికి మైలేజ్ తీసుకు వచ్చే పనిలో పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీని గద్దె దించడమే లక్ష్యంగా, బిజెపి బలమైన పార్టీగా తమను తాము చూపించుకోవాలి అని ప్రయత్నం చేస్తుంది. ఇక బిజెపి చేస్తున్న ప్రయత్నానికి చెక్ పెట్టడానికి టిఆర్ఎస్ పార్టీ శతవిధాల ప్రయత్నాలు సాగిస్తుంది.

బీజేపీకి మైలేజ్ రాకుండా అడ్డుకునే మాస్టర్ ప్లాన్ చేసిన కేటీఆర్

బీజేపీకి మైలేజ్ రాకుండా అడ్డుకునే మాస్టర్ ప్లాన్ చేసిన కేటీఆర్

బిజెపికి మైలేజ్ రాకుండా అష్టకష్టాలు పడుతుంది. ఇప్పటికే సాలు మోదీ సంపకు మోదీ అంటూ ఫ్లెక్సీలతో రచ్చ చేసిన టిఆర్ఎస్, ఆ తర్వాత హైదరాబాద్ నగరంలోని హోర్డింగ్ లను బుక్ చేసుకుని పోటాపోటీగా గులాబీ ఫ్లెక్సీలను, కటౌట్లను ఏర్పాటు చేసింది. బిజెపి ప్రచారానికి చెక్ పెట్టడానికి ప్రయత్నించింది. ఆపై బీజేపీ కీలక నేత అయిన ఈటల రాజేందర్ కు సంబంధించిన జమున హెచరీస్ భూములను రైతులకు పంచి బీజేపీ నేతలకు షాక్ ఇచ్చింది. ఆపై గ్రేటర్ హైదరాబాద్ లోని బిజెపికి చెందిన నలుగురు కార్పొరేటర్ లను కార్ ఎక్కించి బిజెపి కి మరో షాక్ ఇచ్చింది.

నేడు యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతానికి ప్లాన్.. రేపు పెద్దఎత్తున ప్రకటనలతో హంగామా

నేడు యశ్వంత్ సిన్హాకు భారీ స్వాగతానికి ప్లాన్.. రేపు పెద్దఎత్తున ప్రకటనలతో హంగామా

ఇక తాజాగా నేడు విపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా కు భారీగా స్వాగతం పలకాలని నిర్ణయించి ఆ ఏర్పాట్లలో నిమగ్నమైంది. ఇక బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరిగే జులై మూడవ తేదీన జాతీయ మీడియాతో పాటు, రాష్ట్ర మీడియాను ఆకర్షించేలా ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన ప్రకటనలను పెద్దఎత్తున ఇవ్వాలని, బిజెపి పై బాగా ఫోకస్ లేకుండా చేయాలని నిర్ణయించింది. ఈ చర్యలతో బీజేపీ సమావేశాలకు మైలేజ్ తగ్గుతుందని టిఆర్ఎస్ పార్టీ భావిస్తోంది.

టీఆర్ఎస్ ఏం చేసినా బీజేపీని అడ్డుకోలేదని చెప్తున్న బీజేపీ నేతలు

టీఆర్ఎస్ ఏం చేసినా బీజేపీని అడ్డుకోలేదని చెప్తున్న బీజేపీ నేతలు

ఈ క్రమంలోనే మంత్రి కేటీఆర్ బృందం బిజెపి ప్రచారానికి అడ్డుకట్ట వేయడానికి నానా తిప్పలు పడుతుంది. ఇక టిఆర్ఎస్ పార్టీ ఎంత బీజేపీని అడ్డుకునే ప్రయత్నం చేసినా, బిజెపి జాతీయ కార్యవర్గ సమావేశాలు సక్సెస్ అయి తీరుతాయని బిజెపి నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో కేసీఆర్ పాలనకు చరమగీతం పలకడానికి ఈ సమావేశాలు నాంది అవుతాయని బీజేపీ నేతలు చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+