Bandi Sanjay: బండి సంజయ్‍కు ఘనస్వాగతం పలికిన కార్యకర్తలు..
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించి అనంతరం హైదరాబాద్ చేరుకున్న బండి సంజయ్ కు కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఢిల్లీ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకున్న సంజయ్ కు స్వాగతం పలికేందుకు పెద్ద సంఖ్యలో బేజీపీ నాయకులు, కార్యకర్తలు వచ్చారు. పూల బొకేలు, శాలువాలతో బండిని సత్కరించారు. తెలంగాణ కాబోయే సీఎం బండి సంజయ్ అంటూ నినాదాలు చేశారు. ఎయిర్ పోర్టు నుంచి సిద్ధాంతి బస్తీ వరకు భారీ ర్యాలీ తీశారు.
శంషాబాద్ బస్టాండ్ వద్ద ఉన్న బీఆర్ అంబేద్కర్ విగ్రహానికి బండి సంజయ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అక్కడ భారీ గజమాలతో బండి సంజయ్ ను బీజేపీ రాష్ట్ర నాయకులు బుక్క వేణుగోపాల్ సత్కరించారు. శుక్రవారం ఢిల్లీలో బండి సంజయ్ బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. తనను నమ్మి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చిన మోడీ, అమిత్ షా, జేపీ నడ్డాకు బండి సంజయ్ ధన్యవాదాలు తెలిపారు.

నరేంద్ర మోడీ నేతృత్వంలో తెలంగాణ రామరాజ్యం తీసుకోస్తామని బండి సంజయ్ అన్నారు. గురువారం బండి సంజయ్ కుటుంబ సమేతంగా ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ఈ సందర్భంగా మోడీ బండి సంజయ్ ను భుజం తట్టి అభినందించారు. తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తీసుకురావాలని బండితో చెప్పారు. బండి సంజయ్ కుటుంబ సభ్యులతో కాసేపు మోడీ ముచ్చటించారు. గత నెల వరకు బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్నారు.

గత నెలలో కాషాయ అధిష్ఠానం బండి సంజయ్ అధ్యక్ష పదవి నుంచి తప్పించింది. బండి సంజయ్ స్థానంలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని నియమించింది. బండి సంజయ్ ను మొదట కేంద్ర మంత్రి వర్గంలోకి తీసుకుంటారని వార్తలు వచ్చాయి. అయితే మంత్రిగా చేయడానికి బండి సంజయ్ నిరాకరించినట్లు తెలుస్తోంది. కొద్ది కాలం పాటు మంత్రిగా చేయడం తనకు ఇష్టం లేనట్లు బండి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే బండి సంజయ్ ను బీజేపీ అధిష్ఠనం జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లుగా తెలుస్తోంది.












Click it and Unblock the Notifications