Kishan Reddy: మేడిగడ్డ బ్యారేజ్ వైఫల్యానికి సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలి.. కిషన్ రెడ్డి..
బీజేపీ(BJP) రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి(kishan reddy) మేడిగడ్డ(medigadda) లక్ష్మీబ్యారేజ్ ను సందర్శించారు. కుంగిపోయిన బ్యారేజ్ పిల్లర్లను పరిశీలించారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మేడిగడ్డ ప్రాజెక్ట్ పిల్లర్లు కుంగుబాటుకు సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని కిషన్ రెడ్డి డిమాండ్ చేశారు. పిల్లర్ల కుంగడంతో బ్యారేజ్ ఉంటుందా.. మొత్తానికే కొట్టుకపోతుందనే ఆందోళ ఉందన్నారు. డ్యా సేఫ్టి అధికారులు ఢిల్లీ నుంచి వచ్చి మేడిగడ్డ సందర్శించారని కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అధికారులు 20 అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ అధికారులను వివరాలు అడిగితే కేవలం 11 అంశాలకు సంబంధించి మాత్రమే సమాధానం ఇచ్చారని తెలిపారు.
మేడిగడ్డ బ్యారేజ్ కుంగడంపై సమగ్ర విచారణ చేయాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం వైఫల్యాలను ప్రజలకు తెలియకుండా.. ప్రభుత్వం వాస్తవాలను దాచిపెట్టే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్టుగా నిలిచిందని ఆరోపించారు. ఈ ప్రాజెక్ట్ ద్వారా వేల కోట్లు దుర్వినియోగం చేశారని కిషన్ రెడ్డి విమర్శించారు. రూ. లక్ష కోట్ల అప్పులు చేసిన కట్టిన కాళేశ్వరం ప్రాజెక్ట్ భవిష్యత్ అంధకారంగా మారిందన్నారు. సీబీఐతో విచారణ జరిపించేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం కోరితే వెంటనే సీబీఐ విచారణకు ఆదేశిస్తామని తెలిపారు.

కేసీఆర్ అవినీతితో మేడిగడ్డ బ్యారేజ్ పగుల్ల్ ఏర్పాడి పిల్లర్లు కుంగిపోయాయని చెప్పారు. విషయం తెలిసిన వెంటనే కేంద్ర జలశక్తి నిపుణులకు లేఖ రాసినట్లు కిషన్ రెడ్డి గుర్తు చేశారు. అందుకే జాతీయ డ్యాం సేఫ్టి అధికారుల బృందం వచ్చి బ్యారేజ్ ను పరిశీలిందన్నారు. మేడిగడ్డ లాగానే అన్నారం బ్యారేజీ పరిస్థితి ఉందన్నారు. బ్యారేజి పిల్లర్స్ కుంగి పోయి ప్రమాదకరంగా తయారైందన్నారు. సీఎం కేసీఆర్ ఇంజనీరుగా అవతారమెత్తి,నాణ్యత ప్రమాణాలు పాటించకుండా నిర్మాణచడంతో ఇలాంటి పరిస్థితి వచ్చిందన్నారు.
On my way to the Medigadda barrage in Bhupalpally Dist.
— G Kishan Reddy (@kishanreddybjp) November 4, 2023
మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయిన నేపథ్యంలో ఇవాళ బీజేపీ నాయకులు లక్ష్మణ్ గారు, ఈటెల రాజేందర్ గారు, రఘునందన్ గారితో కలిసి కాళేశ్వరం ప్రాజెక్ట్ వద్దకు చేరుకున్నాను. pic.twitter.com/bi229uReLC
కేసీఆర్‌లో నీతి, నిజాయితి ఉంటే.. మేడిగడ్డ బ్యారేజీ వైఫల్యానికి నైతిక బాధ్యత వహించాలి. pic.twitter.com/JMazHPiqBJ
— G Kishan Reddy (@kishanreddybjp) November 3, 2023
తెలంగాణ ప్రజలకి కాళేశ్వరం ప్రాజెక్టు గుదిబండగా మారిందని పేర్కొన్నారు. రైతులకు ఈ ప్రాజెక్టు వల్ల ఎలాంటి ఉపయోగం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుకు వస్తే పదహేను నిమిషాలలో సీబీఐ దర్యాప్తుకు ఆదేశిస్తామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. రీ డిజైన్ పేరుతో లక్షల కోట్ల ప్రజాధనం గోదావరి పాలు చేశారని ఆరోపించారు. బ్యారేజ్ పరిశీలించిన వారిలో ఎంపీ లక్ష్మణ్, ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉన్నారు.












Click it and Unblock the Notifications