వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

యాదాద్రి ఆలయ స్థంభాలపై కేసీఆర్, కారు చిత్రాలా? : రాజా సింగ్ వార్నింగ్

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: తెలంగాణలో ప్రముఖ దేవాలయం యాదాద్రి ఆలయానికి ఉపయోగించే శిలలపై తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు, టీఆర్ఎస్ పార్టీ గుర్తు అయిన కారు చిత్రాలు చెక్కడం తీవ్ర వివాదానికి దారితీస్తోంది. ఈ అంశంపై బీజేపీ నేత, గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

ఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగుఢిల్లీ రైల్వే స్టేషన్ భారీ అగ్ని ప్రమాదం: ఎక్స్‌ప్రెస్ రైలులో మంటలు, ప్రయాణికుల పరుగు

యాదగిరి లక్ష్మీనర్సింహస్వామి ఆలయం తెలంగాణలోనే భవ్యమైన మందిరమని.. అది ఏ పార్టీది కాదని రాజా సింగ్ అన్నారు. అయితే, ఆలయ స్తంభాలపై కేసీఆర్, కారు చిత్రాలు చెక్కడం ఏంటని ఆయన ప్రశ్నించారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు శుక్రవారం రాజా సింగ్ ఓ వీడియోను విడుదల చేశారు.

BJP Raja Singh raises stink on ‘KCR carvings in Yadadri temple’

యాదాద్రి ఆలయం టీఆర్ఎస్ పార్టీది కాదని, కేసీఆర్ తన జేబులోంచి తీసిన డబ్బులు ఏమీ గుడి నిర్మాణం కోసం ఖర్చు పెట్టడం లేదని రాజా సింగ్ అన్నారు. ప్రజల సొమ్ముతోనే ఆలయాన్ని అభివృద్ధి చేస్తున్నామనే విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అలాంటప్పుడు కేసీఆర్, కారు బొమ్మలు ఆలయ స్తంభాలపై ఎందుకని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు సిగ్గుచేటని ధ్వజమెత్తారు.

ఈ ఘటనకు బాధ్యులైన వారిపై చర్యలు తీసుకోవడంతోపాటు స్తంభాలపై చెక్కిన కేసీఆర్, కారు చిత్రాలను వెంటనే తొలగించాలని రాజా సింగ్ డిమాండ్ చేశారు. లేదంటే ప్రజలతోపాటు ఆలయానికి వెళ్లి తామే ఆ చిత్రాలను తొలగిస్తామని రాజా సింగ్ హెచ్చరించారు.

English summary
Yadadri temple renovation has been one of the most prestigious initiatives of Telangana Chief Minister K Chandrasekhara Rao.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X