మెడికో ప్రీతి ఘటనపై స్పందించిన బీజేపి.! లవ్ జీహాదీగా అభివర్ణించిన బండి సంజయ్.!
ప్రీతిది ముమ్మాటికీ ‘‘లవ్ జిహాదీ కేసు’’ అని, టార్గెట్ చేసి అమ్మాయిలను వేధిస్తున్నారని, విదేశాల నుండి పెద్ద ఎత్తున నిధులొస్తున్నాయి కాబట్టి ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయన్నారు బండి సంజయ్.
వరంగల్/హైదరాబాద్ : వరంగల్ లో మెడికల్ విద్యార్ధిని ప్రీతిపై ర్యాగింగ్ చేయడంవల్లే ఆత్మ హత్యాయత్నం చేసిందని, పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని బీజేపి తెలంగాణ అద్యక్షుడు బండి సంజయ్ ఘాటు ఆరోపణలు చేసారు. విద్యార్థి సంఘాల ఆందోళనను చల్లబర్చడానికి మెరుగైన వైద్యం పేరుతో జాప్యం చేస్తున్నారన్నారు. అనేక సార్లు అమ్మాయిపై వేధింపులకు గురిచేసిందని ప్రీతి తండ్రే స్వయంగా చెప్పారన్నారు బండి సంజయ్. దీనిని అత్యంత సాధారణ కేసుగా మార్చి, నీరుగార్చే కుట్ర జరుగుతుందన్నారు బండి సంజయ్.

బండి సంజయ్ సంచలనం..
అంతే కాకుండా వేధింపులకు పాల్పడ్డ వారి విషయంలో ఉదారత చూపుతున్న పోలీసులు అమ్మాయి కుటుంబ సభ్యలుపై చూపకపోవడం అత్యంత హేయమైన చర్య అన్నారు బండి సంజయ్. ప్రీతి సంఘటన ముమ్మాటికీ లవ్ జిహాదీ కేసుగా బండి సంజయ్ అభివర్ణించారు. అంతే కాకుండా హిందూ అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నరని మరో సంచలన ఆరోపణ కూడా బండి సంజయ్ చేసారు. కేసును నీరుగార్చేందుకు పోలీసులు ప్రమత్నిస్తున్నారని, ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

ప్రీతి కేసు నీరుగార్చే ప్రయత్నాలు..
అంతే కాకుండా ఇతర దేశాల నుండి డబ్బులొస్తున్నాయి కాబట్టి, అమ్మాయిలను టార్గెట్ చేసి లవ్ జిహాదీ పేరుత వేధిస్తున్నారన్నారు బండి సంజయ్. ఈ కేసును నిర్వీర్యం చేయడానికి నామమాత్రంగా కేసులు పెట్టి నిందితుడిని రక్షించే యత్నం చేస్తున్నారన్నారు బండి సంజయ్. బీఆర్ఎస్ ప్రభుత్వం మనిషి ప్రాణాన్ని తేలికగా తీసిపారేస్తున్నారని, హైదరాబాద్ లో కుక్కల దాడిలో చిన్న పిల్లాడు చినిపోతే కుక్కలకు మటన్ దొరకకపోవడంవల్లే అలా చేశాయని తేలికగా చెప్పడం సిగ్గు చేటన్నారు బండి సంజయ్.

సీఎం కేసీఆర్ స్పందన ఏది.?
ప్రీతితో పాటు అంబర్ పేట కుక్కల దాడి వంటి రెండు విషయాల్లో ఇప్పటి వరకు సీఎం చంద్రశేఖర్ రావు స్పందించకపోవడం సిగ్గు చేటన్నారు. ప్రీతి ఘటనపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరపాలని, నిందితుడిని కఠినంగా శిక్షించాలని, సీఎం చంద్రశేఖర్ రావుకు ఎస్సీ, ఎస్టీ, బీసీ, పేదలంటే చాలా చులకన అని, వాళ్లకు ఏం జరిగినా పట్టించుకోని మూర్ఖుడు సీఎం చంద్రశేఖర్ రావని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేసారు. చంద్రశేఖర్ రావుకు దమ్ముంటే తెలంగాణలో జరిగిన అభివ్రుద్ధి, ఇచ్చిన హామీలతోపాటు కేంద్రం తెలంగాణకు ఎన్ని నిధులిచ్చిందనే అంశంపై బహిరంగ చర్చకు సిద్ధం కావాలని, దమ్ముంటే సవాల్ ను స్వీకరించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.

ప్రీతి కేసును సిట్టింగ్ జడ్జితో విచారించాలి..
తెలంగాణ ప్రజలంతా చంద్రవేఖర్ రావు కుటుంబ సభ్యులేనని చెప్పడం పెద్ద జోక్ గా బండి సంజయ్ అభివర్ణించారు. తెలంగాణ ద్రోహులే చంద్రశేఖర్ రావు కుటుంబ సభ్యులని ఎద్దేవా చేసారు. తెలంగాణ ప్రజలు నిజంగానే కుటుంబ సభ్యులైతే డబుల్ బెడ్రూం ఇండ్లు ఎందుకు ఇవ్వలేదని, ప్రతి నెల ఒకటో తేదీ నాడు జీతాలెందుకు ఇవ్వడం లేదో వివరించాలన్నారు బండి సంజయ్. నిరుద్యోగులకు ఉద్యోగాలెందుకు ఇవ్వడం లేదని, పేదలు, రైతులు కష్టాల్లో ఉంటే ఎందుకు స్పందించడం లేదని, దళిత బంధు, గిరిజన బంధు ఎందుకు ఇవ్వడంలేదో ప్రజలకు వివరించాలని బండి సంజయ్ డిమాండ్ చేసారు.












Click it and Unblock the Notifications