పది రోజుల్లో బిజెపి కొత్త చీఫ్: రేసులో లక్ష్మణ్, మురళీధర రావు
హైదరాబాద్: భారతీయ జనతా పార్టీ తెలంగాణ అధ్యక్షుడి ఎన్నిక మరో పది రోజుల్లో పూర్తి కానుంది. కొత్త అధ్యక్షుడి రేసులో జాతీయ కార్యదర్శి మురళీధర రావు, బిజెపి శాసన సభా పక్ష నేత డాక్టర్ కె లక్ష్మణ్, సీనియర్ నేత పేరాల చంద్రశేఖర్ తదితరులు ఉన్నారు.
బిజెపి తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డి ఇప్పటికే రెండుసార్లు రాష్ట్ర అధ్యక్షుడిగా టర్మ్‌లు పూర్తి చేసుకున్నారు. ఈసారి కొత్త వారికి అవకాశం ఇవ్వనున్నారు. బిజెపి కార్యదర్శి కృష్ణదాస్ ఆదివారం నాడు నేతలతో అధ్యక్షుడి విషయమై విడివిడిగా చర్చించారు. సోమవారం కూడా చర్చించనున్నారు.

రేసులో మురళీధర రావు, డాక్టర్ కె లక్ష్మణ్, పేరాలలతో పాటు మాజీ ఎమ్మెల్యే యెండల లక్ష్మీనారాయణ, ఎమ్మెల్సీ రామచంద్ర రావు, అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు తదితరుల పేర్లు కూడా వినిపిస్తున్నాయి.
కొత్త అధ్యక్షుడిపై బిజెపి జాతీయ అధ్యక్షులు అమిత్ షా, కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు, ప్రస్తుత తెలంగాణ అధ్యక్షులు కిషన్ రెడ్డిలు కూడా చర్చించనున్నారు. తెలంగాణ రాష్ట్ర బిజెపి కొత్త అధ్యక్షుడిని పది రోజుల్లో కొత్త నియమించేందుకు జాతీయ నాయకత్వం కసరత్తు చేస్తోంది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications