Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

టీడీపీ - బీజేపీ పొత్తులో బిగ్ ట్విస్ట్ : షర్మిల చేతిలో నిర్ణయం..!?

తెలుగు రాజకీయాల్లో బీజేపీ కొత్త స్కెచ్ సిద్దం చేస్తోంది. ముందుగా తెలంగాణ పైన ఫోకస్ పెట్టింది. మరి కొద్ది నెలల్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది బీజేపీ లక్ష్యం. ఇందుకోసం కలిసొచ్చే పార్టీలతో పొత్తుల పైన ఆలోచన చేస్తోంది. టీడీపీ ఇప్పటికే పొత్తుకు సిద్దమనే సంకేతాలు ఇచ్చింది. తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు వద్దని సూచిస్తున్నారు. ఇదే సమయంలో అనూహ్యంగా వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిలకు అండగా నిలుస్తూ..పరస్పరం సహకరించుకోవాలని బీజేపీ భావిస్తోంది. దీంతో, టీడీపీతో పొత్తు - షర్మిల తో రాజకీయ ప్రయాణం తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు కీలకంగా మారబోతున్నాయి. ఈ మొత్తం వ్యవహారంలో షర్మిల నిర్ణయం కీలకంగా మారబోతోంది.

టీడీపీతో పొత్తు పై బీజేపీ ఆలోచనలో మార్పు..

టీడీపీతో పొత్తు పై బీజేపీ ఆలోచనలో మార్పు..

రెండు తెలుగు రాష్ట్రాల్లో 2014 తరహా పొత్తులను టీడీపీ కోరుకుంటోంది. దీనికి సంబంధించి ఇప్పటికే బీజేపీ అధినాయకత్వానికి సంకేతాలు పంపింది. తెలంగాణలో టీడీపీతో పొత్తు పెట్టుకుంటే కలిగే లాభ నష్టాల పైన ఆలోచన చేస్తున్నట్లు బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్‌ ఛుగ్‌ వెల్లడించారు. ఇప్పటి వరకు ఏపీ - తెలంగాణ బీజేపీ నేతలు టీడీపీతో పొత్తు ప్రసక్తే లేదని చెబుతూ వచ్చారు. కానీ, తొలి సారి గా పార్టీ రాష్ట్ర ఇంఛార్జ్ మాత్రం టీడీపీతో పొత్తు అంశం పైన ఆలోచన చేస్తున్నామని వెల్లడించారు. టీడీపీతో పొత్తు ద్వారా 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం జరిగి...కేసీఆర్ కు మేలు జరిగిందని బీజేపీ నేతలు పార్టీ అధినాయకత్వానికి వివరిస్తున్నారు. అయితే, ఇప్పుడు టీడీపీ బలం నిజంగా తెలంగాణలో ఉందా..పొత్తు పెట్టుకుంటే ఏ మేర ఓటింగ్ శాతం కలిసి వస్తుందనే అంశాల పైన కసరత్తు చేస్తున్నారు. ఆ తరువానే తుది నిర్ణయం తీసుకొనే అవకాశం కనిపిస్తోంది.

షర్మిలకు బీజేపీ తాజా ప్రతిపాదన..

షర్మిలకు బీజేపీ తాజా ప్రతిపాదన..

ఇదే సమయంలో వైఎస్సార్టీపి ..ఆ పార్టీ అధినేత్రి షర్మిల గురించి తరుణ్ చుగ్ కీలక వ్యాఖ్యలు చేసారు. వైఎస్సార్టీపీ బలపడితే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ ఓటు బ్యాంకుకు దెబ్బపడుతుందని అధిష్ఠానం భావిస్తోందని తరుణ్ చుగ్ వెల్లడించారు. దీని కారణంగానే షర్మిలకు అండగా నిలవాలనుకుంటున్నామని చెప్పుకొచ్చారు. ఇప్పటికే షర్మిల బీజేపీ వదిలిన బాణంగా గులాబీ నేతలు ప్రచారం చేస్తున్నారు. కానీ, షర్మిల మాత్రం తనకు ఏ పార్టీతోనూ సంబంధం లేదని స్పష్టం చేసారు. ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. కేసీఆర్ ను ఎదుర్కోవాలంటే బీజేపీతో కలవటం ప్రయోజనకరంగా ఉంటుందని కొందరు బీజేపీ - షర్మిల మధ్య రాయబారం చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. షర్మిల ఇందుకు అంగీకరిస్తే వచ్చే ఎన్నికల్లో బీజేపీ వైఎస్సార్టీపి తో బీజేపీ పొత్తు ఖరారయ్యే అవకాశం ఉంది. దీంతో..ఇప్పుడు షర్మిల నిర్ణయం కీలకంగా మారుతోంది. విదేశీ పర్యటనలో ఉన్న షర్మిల ఈ నెల 19న హైదరాబాద్ రానున్నారు.

అక్కడ బీజేపీ కోసం..ఇక్కడ టీడీపీ కోసం

అక్కడ బీజేపీ కోసం..ఇక్కడ టీడీపీ కోసం

తెలంగాణలో బీఆర్ఎస్ ను ఎదుర్కోవటంలో టీడీపీ..వైఎస్సార్టీపి రెండు పార్టీలతో ఎవరితో వెళ్తే ప్రయోజనకరమనేది బీజేపీ ఆలోచన చేస్తోంది. టీడీపీతో గతంలో చోటు చేసుకున్న అనుభవాలు..తెలంగాణలో పొత్తు పెట్టుకుంటే కలిగే ప్రయోజనాల పైన చర్చ జరుగుతోంది. అదే సమయంలో చంద్రబాబుతో పొత్తు పైన స్థానిక నేతల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుంటున్నారు. కేసీఆర్ పైన పోరాటం చేస్తున్న షర్మిల తో మైత్రి ద్వారా కాంగ్రెస్ - వైఎస్సార్ ఓట్ బ్యాంకు కూడా తమకు కలిసి వస్తుందని బీజేపీ అంచనా వేస్తోంది. తెలంగాణ ప్రభావం చూపే ఒక ప్రధాన సామాజిక వర్గం మద్దతు లభిస్తుందని అంచనాలు వ్యక్తం అవుతున్నాయి. బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్ కు వెళ్లకుండా.. షర్మిలకు వచ్చేలా వ్యూహాలు అమలు చేయాలని భావిస్తోంది. అయితే, బీజేపీ ప్రతిపాదనలకు షర్మిల అంగీకరిస్తేనే ఇది సాధ్యం అవుతోంది. దీంతో..ఇప్పుడు తెలంగాణలో టీడీపీ - షర్మిల తో ఎవరితో బీజేపీ కలిసి వెళ్తుంది..లేక ఇద్దిరితోనూ కలుస్తుందా..అది సాధ్యమేనా అనేది కొద్ది రోజుల్లో స్పష్టత రానుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+