Bandi Sanjay: ఆ కలెక్టర్లపై ఫిర్యాదుకు సిద్ధమైన బండి సంజయ్..!

నలుగురు కలెక్టర్లపై డీవోపీటీకు ఫిర్యాదు చేయడానికి బండి సంజయ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.

రాష్ట్రంలో నలుగురు కలెక్టర్లు సీఎం కేసీఆర్ కు ఆస్తులు కూడబెడుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలసింది. అయితే ఆయన ఆరోపణులు చేయడమే కాదు.. ఆ నలుగులు కలెక్టర్లపై ఫిర్యాదు చేయడానికి సిద్ధమయ్యారు. తమ వద్ద ఆధారలున్నాయని కూడా సంజయ్ చెప్పారు.

కేసీఆర్ కుటుంబానికి ఊడిగం

కేసీఆర్ కుటుంబానికి ఊడిగం

ఆ నలుగురు కలెక్టర్లు కేసీఆర్ కుటుంబానికి ఊడిగం చేస్తున్నారని విమర్శించారు. త్వరలోనే ఆ నలుగురు కలెక్టర్ల బండారం బయట పెడతానని చెప్పిన సంజయ్.. తాజాగా డీవోపీటీ అధికారుల అపాయింట్ మెంట్ కోరినట్లు తెలుస్తోంది. ధరణి పేరుతో ఆ నలుగురు కలెక్టర్లు పేదల భూము లను లాక్కున్నారని సంజయ్ అన్నారు.

పక్కా ఆధారాలు

పక్కా ఆధారాలు

ఆ నలుగురు కలెక్టర్లపై పక్కా ఆధారాలు తీసుకున్న బండి సంజయ్ గురువారం లేదా శుక్రవారం ఢిల్లీలోని డిపార్ట్ మెంట్ఆఫ్ పర్సనల్ ట్రెయినింగ్ అధికారులకు ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. బుధవారం పార్లమెంట్ సమావేశాలకు హాజరైన ఆయన డీవోపీటీ అపాయింట్ మెంట్ ఇవ్వగానే వారిని కలిసి ఆధారాలు సమర్పించే అవకాశం ఉంది.

119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో

119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో

బండి సంజయ్ సంచలన ఆరోపణలతో రాష్ట్రంలో ఉన్న ఐఏఎస్ అధికారుల్లో చర్చలు జరుగుతున్నాయి. ఆ నలుగురు కలెక్టరు ఎవరై ఉంటారని చర్చించుకుంటున్నారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ఎంఐఎంకు బండి సంజయ్ సవాల్ విసిరారు. తెలంగాణలో హిందువులంతా ఓటు బ్యాంకుగా మారుతున్నారన్న బండి.. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని ఆరోపించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+