వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

తెలంగాణా పోలీసులకు పింక్ డ్రెస్; గవర్నర్ కు, కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేస్తాం: తరుణ్ చుగ్

|
Google Oneindia TeluguNews

తెలంగాణ బిజెపి వ్యవహారాల ఇన్ చార్జ్ తరుణ్ చుగ్ తెలంగాణ సీఎం కేసీఆర్ పై, తెలంగాణ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. తెలంగాణ పోలీసులు టిఆర్ఎస్ కు అనుకూలంగా పని చేస్తున్నారని, కరీంనగర్ లో కొందరు పోలీసులు గులాబీ నేతలు ఏం చెప్తే అది చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణ పోలీసులు పింక్ డ్రెస్ వేసుకోవాలంటూ బిజెపి తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ ఎద్దేవా చేశారు.

Recommended Video

Analysis On JP Nadda Hyderabad Visit | BJP Vs TRS | Oneindia Telugu
కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడి

కేసీఆర్ ఆదేశాలతోనే బండి సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడి


తెలంగాణ సీఎం కేసీఆర్ సూచనలతోనే బిజెపి ఎంపీ, బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై దాడి జరిగిందని, బీజేపీ కార్యకర్తల పై, నేతలపై పోలీసులు అనుచితంగా ప్రవర్తించారని అసహనం వ్యక్తం చేశారు. మనసులో ద్వేషంతో, క్రిమినల్ మైండ్ తో ఎంపీ కార్యాలయంపై దాడి చేశారని ఆయన ఆరోపించారు. బండి సంజయ్ కార్యాలయంపై పోలీసుల దాడిని ఖండిస్తున్నామని చెప్పిన ఆయన జాగరణ దీక్షను జలియన్వాలాబాగ్ లా మార్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

మహిళా కార్యకర్తలకు జరిగిన అవమానానికి సమాధానం చెప్తాం

మహిళా కార్యకర్తలకు జరిగిన అవమానానికి సమాధానం చెప్తాం


తెలంగాణ సీఎం బంగారు తెలంగాణ తీసుకొస్తామన్నారు కానీ మాట తప్పారని మండిపడ్డారు. నాడు ద్రౌపదీ వస్త్రాపహరణం తో మహాభారత యుద్ధం వచ్చిందని, కరీంనగర్ లో కూడా కొందరు పోలీసులు దుర్యోధన, దుశ్యాసన పర్వానికి శ్రీకారం చుట్టి బిజెపి మహిళా కార్యకర్తలను అవమానించారని, వీటన్నిటికీ కచ్చితంగా న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా సమాధానం చెప్పి తీరుతామని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. ఒక్కో మహిళా కార్యకర్త మీద జరిగిన దాడికి జవాబు చెబుతామని స్పష్టం చేశారు.

కేసీఆర్ ఆడించినట్టు ఆడే పోలీసులు

కేసీఆర్ ఆడించినట్టు ఆడే పోలీసులు

తెలంగాణ పోలీసులు కేసీఆర్ ఆడించినట్లు ఆడుతున్నారని, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు భక్షిస్తున్నారు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసులు పింక్ కలర్ బార్బీ డాల్స్ లా మారారని తరుణ్ చుగ్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కరీంనగర్ లో పోలీసులు గూండాగిరి చేస్తున్నారంటూ తిట్టిపోశారు. కరీంనగర్ సీపీ జనరల్ డయ్యర్ మాదిరిగా వ్యవహరించారని విమర్శలు గుప్పించారు. ప్రశాంతంగా దీక్ష చేస్తున్న బండి సంజయ్ ను కోవిడ్ నిబంధనల పేరుతో అరెస్టు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

టీఆర్ఎస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఫిర్యాదు చెయ్యనున్న బీజేపీ

టీఆర్ఎస్ సర్కార్ తీరును నిరసిస్తూ ఫిర్యాదు చెయ్యనున్న బీజేపీ

తాము ప్రజాక్షేత్రంలో ఉండి పోరాడుతుంటే కాంగ్రెస్ నాయకులు ఏసీ రూముల్లో ఉండి మాట్లాడుతున్నారంటూ కాంగ్రెస్ పార్టీ ని టార్గెట్ చేసి విమర్శలు గుప్పించారు. కరీంనగర్లో పోలీసుల తీరుపై గవర్నర్ తో పాటు కేంద్ర హోం శాఖకు కూడా ఫిర్యాదు చేస్తామని తరుణ్ చుగ్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని టిఆర్ఎస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ ఆందోళనలు కొనసాగుతాయని ఆయన స్పష్టం చేశారు. బీజేపీ కార్యకర్తల పై జరిగిన ప్రతి దాడిని తాము గుర్తుంచుకుంటామని, సమాధానం చెప్పి తీరుతామని పేర్కొన్నారు.

English summary
BJP Telangana affairs in-charge Tarun Chugh said they would lodge a complaint with the governor and the Union Home Ministry over the police attack on Bandi Sanjay's office..
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X