ఇదీ తెలంగాణలో పాగాకు అమిత్‌షా ఆపరేషన్!

Posted By: Swetha
Subscribe to Oneindia Telugu

హైదరాబాద్‌: మూడేళ్ల క్రితం లోక్‌సభ సార్వత్రిక ఎన్నికల్లో విజయం.. బీహార్, ఢిల్లీ మినహా అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఘన విజయం సాధించారు కమలనాథులు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ అసెంబ్లీలకు జరిగిన ఎన్నికల్లో చారిత్రక విజయాలు సాధిస్తున్నబీజేపీ.. మంచి జోష్‌ మీదున్న బీజేపీ దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేసేందుకు దృష్టి సారిస్తోంది.

బీజేపీ ప్రయత్నాల్లో భాగంగా తెలంగాణపై దృష్టి సారించినట్టు విస్తృత ప్రచారం జరుగుతోంది. రాష్ట్రంలో చోటు చేసుకుంటున్న పరిణామాలు నిజమేనన్న అభిప్రాయం కలుగుతోంది. కాంగ్రెస్ పార్టీలోని సీనియర్‌ నేతలు, మాజీ మంత్రులపై కమలనాథులు ప్రధానంగా దృష్టి సారిస్తున్నారని సమాచారం. బీజేపీ నాయకులు ఇప్పటికే జిల్లాల్లో పలువురు నేతల్ని కలిసి తమ ప్రతిపాదనల్ని వారి ముందు ఉంచారని తెలుస్తోంది.

చాలా మంది సీనియర్ కాంగ్రెస్ నేతలకు ఎంపీ టికెట్లు, వారి అనుచరులకు ఎమ్మెల్యే టికెట్లు ఇస్తామని హామీ ఇవ్వజూపినట్లు సమాచారం. వారు వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించేందుకు అవసరమైన అన్ని రకాల ఆర్థికంగా, హార్ధికంగా సహాయ సహకారాలు అందించేందుకు కూడా సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలిసింది.

కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆర్థికంగా అండగా నిలుస్తామన్న బీజేపీ హామీ

కాంగ్రెస్ పార్టీ నేతలకు ఆర్థికంగా అండగా నిలుస్తామన్న బీజేపీ హామీ

ఆర్థికంగా కూడా చూసుకుంటామని కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు భరోసా ఇచ్చినట్లు సమాచారం. కొందరు నేతలు ఈ విషయంలో ఆలోచనలో పడగా, మరికొందరు మాత్రం తాము కాంగ్రెస్ పార్టీని వీడబోమని ఖరాఖండిగా చెప్పినట్లు తెలిసింది. అయినా బీజేపీ నేతలు తమ ప్రయత్నాలను కొనసాగిస్తున్నారని తెలియవచ్చింది. అలా సదరు నేతలకు సానుకూల సంకేతాలు పంపుతున్నట్లు సమాచారం. ఈ విషయం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఆసక్తికర చర్చగా మారింది.

బీజేపీ నేతల సంప్రదింపులపై టీపీసీసీ ఆరా

బీజేపీ నేతల సంప్రదింపులపై టీపీసీసీ ఆరా

ఎవరెవరు నేతలను బీజేపీ నాయకత్వం సంప్రదించిందీ, బీజేపీ నేతల ప్రతిపాదనలకు కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలా స్పందించారు? కమలనాథులు సంప్రదించిన నేతలంతా పార్టీలోనే ఉంటారా, పోతారా అనే అంశాలపై ఇపుడు కాంగ్రెస్ పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకులు కూడా ఈ విషయంపై ఆరా తీస్తున్నట్లు సమాచారం. పాత జిల్లాలైన రంగారెడ్డి, మెదక్‌, వరంగల్‌, హైదరాబాద్‌, నల్గొండ, మహబూబ్‌నగర్‌లలో ఎవరెవరిని సంప్రదించారో పార్టీ అగ్రనేతల వద్ద ఇప్పటికే సమాచారం ఉంది. ఆదిలాబాద్‌, నిజామాబాద్‌లలో ముఖ్య నేతలతో కాకుండా ద్వితీయస్థాయి నేతల్ని సంప్రదించినట్లు తెలిసింది. రంగారెడ్డి జిల్లాల్లో ఓ మాజీ మంత్రిని సంప్రదించి ఒకరికి ఎంపీ, మరొకరికి అసెంబ్లీ టికెట్లు ఇస్తామని బీజేపీ నేతలు హామీ ఇచ్చారని విశ్వసనీయ వర్గాల భోగట్టా.

భావి పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల నజర్

భావి పరిణామాలపై తెలంగాణ కాంగ్రెస్ నేతల నజర్

కొందరు కాంగ్రెస్ నేతలు కమలనాథుల ప్రతిపాదనను తిరస్కరించినా, భవిష్యత్ పరిణామాలను బట్టి నిర్ణయం ఉంటుందని ప్రచారం సాగుతోంది. ఇప్పటికే మెదక్‌ జిల్లాలో మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్‌గౌడ్‌ బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే జిల్లాకు చెందిన ఒక మాజీ మంత్రిని నిజామాబాద్ కు చెందిన బీజేపీ మాజీ ఎమ్మెల్యే సంప్రదించగా ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది. నల్గొండ జిల్లాలో అసంతృప్తితో ఉన్న కాంగ్రెస్‌ ముఖ్య నేతలిద్దర్నీ సంప్రదించగా వారు వేచిచూసే ధోరణిలో తమ ఛాయిస్‌ ఇచ్చినట్లు సమాచారం. బహిరంగంగా ఈ ప్రతిపాదనను వారు ఖండిస్తున్నా బీజేపీ వర్గాలు మాత్రం తాము వీరి విషయంలో ఆశాజనకంగా ఉన్నామని చెబుతున్నాయి.

హైదరాబాద్ మాజీ మంత్రి ఆకర్షణీయ ఆఫర్

హైదరాబాద్ మాజీ మంత్రి ఆకర్షణీయ ఆఫర్

ఇక రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌ నగరానికి చెందిన మాజీ మంత్రి ఒకరు ఇటీవల బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత షాను నగరంలోని ఓ హోటల్‌లో కలిసినట్లు తెలిసింది. ఆయనకు కూడా ఆకర్షణీయమైన ఆఫర్‌ ఇవ్వగా ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వంలో కీలకమైన పదవిలో వరంగల్‌ జిల్లాకు చెందిన మరో నేతను సంప్రదించగా ప్రతిపాదనను తిరస్కరించినట్లు తెలిసింది.

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అనుకూల నేతలపై ద్రుష్టి

ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో అనుకూల నేతలపై ద్రుష్టి

ఇక ఆదిలాబాద్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో బీజేపీ తమకు అనుకూలంగా ఉండే నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ ద్వితీయ శ్రేణి నాయకులపై దృష్టిపెట్టినట్లు తెలిసింది. ఇతర జిల్లాల్లో కూడా ఇంచుమించు ఇలాంటి యోచనతోనే ఉన్నట్లు తెలుస్తోంది. ముందుగా పెద్ద నేతలు, ఆ తర్వాత ద్వితీయ శ్రేణి నాయకత్వం లేనిపక్షంలో టీడీపీ ఆవిర్భావ సమయంలో తొలిసారి ఎన్నికల్లో దిగినపుడు ఆయా నియోజక వర్గాల్లో ప్రభావ శీలురైన వ్యక్తులపై నజర్‌ వేసినట్లు స్పష్టమైన సంకేతాలు ఉన్నాయి.

సొంత అంచనాల్లో టీపీసీసీ నేతలు

సొంత అంచనాల్లో టీపీసీసీ నేతలు

మొత్తం బీజేపీ నేతల సంప్రదింపుల వ్యవహారాన్ని సునిశితంగా పరిశీలిస్తున్న టీపీసీసీ అగ్రనేతలు వారి అంచనాల్లో వారు ఉన్నారు. బీజేపీ వైపు మొగ్గు చూపుతున్న నేతలు ఎవరు? ఊగిసలాడుతున్నదెవరు? అనే విషయంపై సమాచారం సేకరిస్తున్నారు. బీజేపీ ప్రతిపాదనలు నిర్ద్వందంగా తిరస్కరించిన వారిని కూడా గమనిస్తున్నారు. ఊగిసలాటలో ఉన్న నేతలు చివరి క్షణంలో చేజారిపోయినా అక్కడ ఏం చేయాలో ప్రత్యామ్నాయ వ్యూహం రూపొందించుకుంటున్నట్లు తెలుస్తోంది.

టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై కాంగ్రెస్ దృష్టి

టీఆర్ఎస్ అసంతృప్తి నేతలపై కాంగ్రెస్ దృష్టి

కమలనాథులు తమ పార్టీలోకి కాంగ్రెస్ నేతలను చేర్చుకునే యత్నాలు సాగిస్తూ ఉంటే ప్రతిగా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం భిన్నమైన వ్యూహం రూపొందిస్తున్నది. అదికార టీఆర్‌ఎస్‌లో అసంతృప్తితో ఉన్న నేతలు, పార్టీతో టచలో ఉన్న వారిపై దృష్టి సారించాలని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇప్పటి వరకు టీఆర్‌ఎస్‌ అసంతృప్తి నేతలపై అంతగా దృష్టి సారించని కాంగ్రెస్‌ ఇకపై వారి విషయంలో సీరియస్‌గా ఉండాలని, ఎవరెవరు పార్టీకి పనికి వస్తారో సీరియ్‌సగా కసరత్తు చేయాలని భావిస్తోంది. వారితో రెగ్యులర్‌గా టచలో ఉంటూ, చేజారిపోకుండా చూసుకోవాలని కాంగ్రెస్‌ అగ్రనాయకులు భావిస్తున్నారు. ఈ పనిని కొందరు నేతలకు అప్పజెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. నిన్న మొన్నటి వరకు టీఆర్‌ఎస్‌ ఆకర్ష్‌తో ఇబ్బంది పడ్డ పార్టీకి తాజాగా బీజేపీతో తలనొప్పి వస్తున్నా, లోటును ఈ మార్గంలో పూడ్చుకోగలమని కాంగ్రెస్‌ అగ్రనేతలు భావిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
BJP targetted Congress leaders in Telangana to devolopment of their party near future.
Please Wait while comments are loading...