వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఢిల్లీలో నేడే కేసీఆర్ రైతు దీక్ష - హాజరు కానున్నటికాయిత్‌ : హస్తినలో గులాబీ నేతలు..!!

|
Google Oneindia TeluguNews

తెలంగాణ ముఖ్యమంత్రి కేంద్రంపై పోరును తీవ్రతరం చేసారు. ఢిల్లీ కేంద్రంగా సీఎం హోదాలో కేంద్ర తీరుకు వ్యతిరేకంగా దీక్షకు సిద్దమయ్యారు. యాసంగి ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ టీఆర్‌ఎస్‌ ఈ రోజు ఢిల్లీలో దీక్షకు దిగుతోంది. ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. తెలంగాణ భవన్ వేదికగా కేసీఆర్.. టీఆర్ఎస్ నేతలు దీక్షలో పాల్గొననున్నారు. టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ సహా దాదాపుగా నేతలందరూ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు.

సీఎం హోదాలో దీక్షలో కేసీఆర్

సీఎం హోదాలో దీక్షలో కేసీఆర్

వారం రోజులుగా ఢిల్లీలోనే ఉన్న కేసీఆర్ ముఖ్యమంత్రి హోదాలోనే ఈ దీక్షలో పాల్గొని కేంద్రానికి స్పష్టమైన సంకేతాలు ఇస్తున్నారు. ఈ దీక్షలో రైతు ఉద్యమ పోరాట నాయకుడు టికాయిత్‌ సైతం హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రధాన రోడ్లు, కూడళ్లు, తెలంగాణ భవన్‌ పరిసరాల్లో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలు, టీఆర్‌ఎస్‌ జెండాలను కట్టారు. కవిత ఈ దీక్ష ఏర్పాట్లను పర్యవేక్షించారు. రైతులకు ద్రోహం చేసిన ఏ ప్రభుత్వమూ మనుగడ సాధించలేదనే విషయాన్ని బీజేపీ ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు.

ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల జోష్

ఢిల్లీలో టీఆర్ఎస్ నేతల జోష్


ఇతర పార్టీల నేతలు సైతం దీక్షా వేదికకు వచ్చి సంఘీభావం ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది. జాతీయ స్థాయిలో సమగ్ర ధాన్యం సేకరణ విధానం తెచ్చి దేశ రైతాంగాన్ని బలోపేతం చేయాలని టీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోందన్నారు.నేడే ఢిల్లీలో టీఆర్‌ఎస్‌ దీక్షరైతుల ఆగ్రహాన్ని తక్కువ అంచనా వేయొద్దు..రైతులను క్షోభ పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి వీడాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

ఫ్లెక్సీలు..నినాదాలతో దీక్షా వేదిక సిద్దం

ఫ్లెక్సీలు..నినాదాలతో దీక్షా వేదిక సిద్దం


తెలంగాణలో పండిన యాసంగి ధాన్యాన్ని ఎలాంటి షరతులు లేకుండా సేకరించాలనే ప్రధాన డిమాండ్ తో ఈ దీక్ష కొనసాగనుంది. దీక్షా ప్రాంగణం చుట్టూ భారీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ఛాయ్‌వాలా.. చావల్‌ లేలో..మాంగ్నే ఆయే.. భీక్‌ మాంగ్నే నహీ', 'మోదీ జీ.. యహా మత్‌ భూలో.. తెలంగాణ కిసాన్‌ భీ భారత్‌కే కిసానే హై' వంటి స్లోగన్లతో ప్లకార్డులు, హోర్డింగులు ఏర్పాటు చేసారు. ఇక, ఢిల్లీ కేంద్రంగా జరిగే ఈ దీక్షలో కేసీఆర్ ప్రసంగంలో ఏ అంశాలను ప్రస్తావిస్తారు..ఏ పార్టీల నేతలు వచ్చి మద్దతిస్తారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా కనిపిస్తోంది.

English summary
Telangana CM KCR is all set to protest against BJP demanding the procurement of Rice by centre.Farmers leader Tikait will attend this protest.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X