బీజేపీ మాటలు పచ్చి మోసం.!యాసంగిలో ప్రత్యమ్నాయ పంటలు వేయాలన్న మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి
హైదరాబాద్ : కేంద్ర బీజేపి ప్రభుత్వంపై విమర్శలకు పదును పెడుతున్నారు గులాబీ మంత్రులు. తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు బృందం ఢిల్లీ పర్యటన తర్వాత సీన్ పూర్తిగా మారిపోయినట్టు తెలుస్తోంది. తెలంగాణ వ్యవహారం పట్ల కేంద్ర మంత్రుల ప్రవర్తన అవమానకరంగా ఉందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావే స్వయంగా ప్రకటించారు. అపాయింట్ మెంట్ కోరితే ఇవ్వకుండా చులకనగా మాట్లాడారని ముఖ్యమంత్రి కేంద్ర మంత్రుల మీద ఆగ్రహం వ్యక్తం చేసారు. తాజాగా తెలంగాణ మంత్రులు కూడా కేంద్ర ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.

బీజేపి మోసపూరిత మాటలు నమ్మొద్దు..యాసంగిలో ప్రత్యామ్నాయ పంటలు వేయాలన్న ఇంద్రకరణ్ రెడ్డి
రాష్ట్ర మంత్రులు నిరంజన్ రెడ్డి, ఎర్రబెల్లి దయాకర్ రావు, గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కేంద్ర మంత్రులను ఘాటుగా విమర్శిస్తున్నారు. ఇప్పుడు అదే కోవలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి చేరిపోయారు.బీజేపీ నాయకులు అసత్య ప్రచారాన్ని నమ్మి మోసపోవద్దని అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి రైతులకు విజ్క్షప్తి చేసారు. బుధవారం జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.

వ్యవసాయ చట్టాలు రద్దు.. ఓటమి భయంతోనే రద్దు చేసారన్న మంత్రి ఇంద్రకరణ్
కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మేరకు యాసంగిలో రైతులు వరి ధాన్యం పండించ వద్దని విజ్ఞప్తి చేశారు. వరికి బదులు ప్రత్యామ్నాయ వాణిజ్య పంటలను వేయాలని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సూచించారు. ఓ వైపున యాసంగిలో వరి ధాన్యం కోనుగోలు చేయమని కేంద్ర ప్రభుత్వం చెప్పుతుంటే, రాష్ట్రంలోని బీజేపీ నేతలు మాత్రం వరి ధాన్యం కోనుగోలు చేయాలని కోరడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం చేసిందేమీ లేదన్నారు. రైతుల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి.

మోదీపై విశ్వాసం లేదు.. ప్రధానిపై ప్రజల్లో నమ్మకం లేదన్న మంత్రి
అంతే కాకుండా ప్రధాని నరేంద్ర మోదీపై ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని, ప్రధాని చెప్పే మాటలను ప్రజలు విశ్వసించడం లేదన్నారు. బీజేపీ రైతు వ్యతిరేఖ ప్రభుత్వమని, ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు ఉన్న నేపథ్యంలోనే సాగు చట్టాలను వెనక్కి తీసుకుందన్నారు. నూతన వ్యవసాయిక చట్టాలకు వ్యతిరేఖంగా ఉద్యమించిన 750 మది రైతులను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పొట్టన పెట్టుకుందన్నారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. రాబోవు ఐదు రాష్ట్రాల్లో ఓటమి భయంతోనే వ్యవసాయ చట్టాలను ప్రధాని వెనక్కి తీసకున్నారని ఇంద్రకరణ్ రెడ్డి మండిపడ్డారు.

తెలంగాణ ప్రభుత్వ ఉదారత..కేసీఆర్ విశాల హృదయం అన్న ఇంద్రకరణ్ రెడ్డి
సాగు చట్టాల రద్దుపై పార్లమెంట్ లో చర్చ జరపాలని విపక్షాలు డిమాండ్ చేసినా, చర్చ జరపకుండానే నిమిషాల వ్యవధిలో బిల్లుకు ఆమోదం తెలిపారని బీజేపీ ప్రభుత్వ తీరును తప్పుపట్టారు. సాగు చట్టాలను నిరసిస్తూ పోరాటంలో అసువులు బాసిన రైతుల కుటుంబాలకు సీయం చంద్రశేఖర్ రావు మానవతా దృక్పథంతో ప్రతి కుటుంబానికి మూడు లక్షల రూపాయల ఆర్థికసాయం అందజేస్తామని ప్రకటించారన్నారు. 750 మంది రైతు కుటుంబాలకు 22.50 కోట్ల రూపాయలను అందజేసేందుకు క్యాబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications