"జూబ్లీహిల్స్ గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ ఇవ్వాలి"
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక షెడ్యూల్ ను ఇటీవల కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే. దీంతో ఈ బై పోల్ పై అందరి ఫోకస్ పడింది. ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ తమ అభ్యర్థిగా దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ సతీమణి మాగంటి సునీతను ప్రకటించింది. అధికార కాంగ్రెస్ పార్టీ నవీన్ యాదవ్ ను బరిలోకి దించింది. బీసీ సామాజిక వర్గానికే టికెట్ ఇస్తామని కాంగ్రెస్ పార్టీ మొదటినుంచి చెబుతూ వచ్చింది. అందుకు అనుగుణంగానే నవీన్ యాదవ్ ను బరిలోకి దింపింది. ఇక తాజాగా జూబ్లీహిల్స్ బై పోల్ పై బీజేపీ నేతలు సమావేశం నిర్వహించారు. ఈ మేరకు మూడు పేర్లను ఖరారు చేసి పార్టీ సెంట్రల్ కు పంపించనున్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ మీటింగ్ లో కిషన్ రెడ్డి, రామ చందర్ రావు, అభయ్ పాటిల్, చంద్రశేఖర్ తివారీ ఇతర ముఖ్య నేతలు పాల్గొన్నారు. ఈ క్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు మాట్లాడుతూ కీలక వ్యాఖ్యలు చేశారు. జూబ్లీహిల్స్ సీటు గెలిచి ప్రధాని మోదీకి గిఫ్ట్ గా ఇవ్వాలని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జూబ్లీహిల్స్ ప్రజలు బీజేపీను ఆశీర్వదించేందుకు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ బీజేపీ గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు భాగ్యనగరాన్ని విశ్వనగరంగా మారుస్తామని విషాద నగరంగా మార్చారని దుయ్యబట్టారు. హైదరాబాద్ మహా నగరాన్ని ఎవరూ అభివృద్ది చేయలేదని.. వానపడితే ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయన్నారు.

హైదరాబాద్ నగరాన్ని బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నిర్లక్ష్యం చేశాయని తెలిపారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం కూడా అభివృద్ధికి నోచుకోలేదన్నారు. జూబ్లీహిల్స్ లో ఓటు హక్కును అడిగే నైతిక హక్కు బీఆర్ఎస్, కాంగ్రెస్ కు లేదని తెలిపారు. కాంగ్రెస్ పార్టీ బీసీలను మోసం చేసిందని.. బీసీలతో రాజకీయాలు చేసిందని విమర్శించారు. మోదీ కుల గణనతో బీసీలకు న్యాయం జరుగుతుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామ చందర్ రావు స్పష్టం చేశారు. 2,3 రోజుల్లో తమ అభ్యర్థిని ప్రకటిస్తామని తెలిపారు.
-
ఆసుపత్రిలో సోనియా గాంధీ అడ్మిట్: హుటాహుటిన రాహుల్, ప్రియాంక: అబ్జర్వేషన్ లో -
కుమార్తెకు లోకేష్ ఊహించని పెళ్లి గిఫ్ట్ -అవాక్కైన టీడీపీ ఎమ్మెల్యే..! -
బెంగాల్ టైగర్ ఎవరో తేల్చేసిన సర్వేలు.. దీదీ మళ్లీ సీఎం అవుతారా? -
Viral Video: ముస్లింలకు పోటీగా మాధవీలత పూజలు..! వీడియో వైరల్..! -
Janasena: టీడీపీ తీరుపై రగులుతున్న జనసేన ఎమ్మెల్యేలు ? ఇవాళ పవన్ ముందే..! -
YSRCP: వెంటాడుతున్న 11, పార్లమెంట్లో ఊహించని ట్విస్ట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
కుప్పకూలుతున్న బంగారం ధరలు- రాక్ బాటమ్ -
లోకసభ, అసెంబ్లీ స్థానాల పెంపు - ఏపీ..తెలంగాణలో పెరిగేది ఇలా, మహిళల స్థానాలు ఇవే..!! -
PM Modi: ఇరాన్ వార్ తో మనకు కష్టాలే..! సిద్ధంగా ఉండాలన్న మోడీ..!












Click it and Unblock the Notifications