బిడిఎల్‌లో పేలుడు: 5గురికి తీవ్రగాయాలు, ముగ్గురి పరిస్థితి విషమం

హైదరాబాద్: నగరంలోని కంచన్‌బాగ్‌లోని బీడీఎల్‌(భారత్ డైనమిక్ లిమిటెడ్)లో భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్ర గాయాలయాయి. క్షతగాత్రులను అపోలో ఆసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది.

Blast in BDL: Five seriously injured

బిడిఎల్‌లో శనివారం ఉదయం 10గంటల ప్రాంతంలో వ్యర్థాలను తగలబెడుతుండగా అందులోని మెటీరియల్ పేలడంతో భారీ ప్రమదం సంభవించింది. అక్కడేవున్న ఐదుగురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు.

Blast in BDL: Five seriously injured

నెలకోసారి ఇలా వ్యర్థాలను తగలబెడతారని, తరచూ ఇలాంటి ప్రమాదాలు చోటు చేసుకుంటాయని స్థానికులు చెబుతున్నారు. బిడిఎల్‌లో ఇటీవల సంభవించిన పేలుడు ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే.

Blast in BDL: Five seriously injured

కాగా, కాంచన్‌బాగ్‌లోని బిడిఎల్‌లో సంభవించిన విస్ఫోటనంలో గాయపడిన బాధితులను తెలంగాణ ఉపముఖ్యమంత్రి మహమూద్‌ అలీ కొద్దిసేపటి క్రితం పరామర్శించారు.

Blast in BDL: Five seriously injured

ఆటో బోల్తా: ముగ్గురు మహిళలు మృతి

మహబూబ్‌నగర్‌ జిల్లాలోని లింగాల మండలం దత్తారం దగ్గర ఓ ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందారు. వీరంతా పెళ్లికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+