నల్గొండ జిల్లాలోని ఐడిఎల్ ఫ్యాక్టరీలో పేలుడు, ఒకరి మృతి
నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.
నల్గొండ: నార్కట్ పల్లి సమీపంలో ఉన్న ఐడిఎల్ ఎక్స్‌ప్లోజివ్స్‌లో సోమవారం నాడు భారీ పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఒకరు మరణించారు. పలువురికి గాయాలయ్యాయి.చనిపోయిన కార్మికుడికి ఒడిశాకు చెందిన లింగరాజు కుమార్‌గా గుర్తించారు.
ఐడిఎల్ ఎక్స్‌ఫ్లోజివ్స్ లిమిటెడ్ కంపెనీలో సోమవారం నాడు డిటోనేటర్లు పేలాయి. ఈ పేలుడు ధాటికి భవనం కుప్పకూలిపోయింది.

అసలు ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పేలుడులో ఓ వ్యక్తి మరణించారు.
డిటోనేటర్లు తయారు చేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకొంది.డిటోనేటర్ల భద్రపర్చిన గదిలో పొరపాటున నీరు పోయడం వల్ల ఈ ప్రమాదం చోటు చేసుకొందని ప్రాధమిక సమాచారం మేరకు సమాచారం అందుతోంది.












Click it and Unblock the Notifications