Chiranjeevi : చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ప్రభుత్వ ఆస్పత్రులకు రక్తం సరఫరా..
మెగాస్టార్ చిరంజీవి నటనలోనే కాదు.. ప్రజా సేవలోనూ ముందుంటారు. ముఖ్యంగా కరోనా సమయంలో సినీ కళాకారులకు ఆయన చేసిన సాయం మరవలేదని. చిరంజీవి ఎప్పటి నుంచి ప్రజా సేవలో ఉన్నారు. ప్రజా సేవలో భాగంగా చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు. ఈ ట్రస్ట్ ద్వారా అనేక కార్యక్రమాలు చేపట్టారు. ముఖ్యంగా బ్లడ్ బ్యాంకు, ఐ బ్యాంక్, కరోనా సమయంలో అక్సిజన్ ప్లాంట్ కూడా ఏర్పాటు చేశారు. ఇలా ప్రజా సేవలో ముందుకు సాగుతున్నారు.
చిరంజీవి ట్రస్ట్ ఇప్పటికే లక్షయ యూనిట్ల రక్తాన్ని ఉచితంగా అందించారు. తాజాగా తెలంగాణలోని ప్రభుత్వ ఆస్పత్రులకు ఉచితంగా రక్తాన్ని అందించారు. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆస్పత్రికి 100 యూనిట్లు, గాంధీ ఆస్పత్రికి 100 యూనిట్లు, నీలోఫర్ ఆస్పత్రికి 100 యూనిట్లు కేటాయించారు. వరంగల్ లోని ప్రభుత్వ ఆస్పత్రులకు, మహబూబ్ నగర్ లోని ప్రభుత్వ ఆస్పత్రులకు 100 యూనిట్ల చొప్పున రక్తాన్ని పంపించారు.

చిరంజీవి బ్లడ్ బ్యాంక్ సెంటర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ మాధవి గారి ఆధ్వర్యంలో వివిధ ఆస్పత్రులకు రక్తాన్ని తరలించారు. చిరంజీవి గారి అభిమానులు చేసే ఈ రక్తదానం ఎంతో మంది నిరుపేదల జీవితాల్లో వెలుగులు నింపుతోందని మాధవి అన్నారు. ఇలాంటి బృహత్తర కార్యానికి అండగా నిలిచిన చిరంజీవి గారి అభిమానులను, రక్తదాతలను కృతజ్ఞతలు తెలిపారు. చిరు సేవలను గుర్తు చేసుకుంటూ.. ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.
కాగా సోమవారం వినాయక చవితి సందర్భంగా మగాస్టార్ చిరంజీవి ఇంట్లో గణపతి విగ్రహాన్ని నెలకోల్పారు. అదే రోజు చిరంజీవి మనవరాలు క్లిన్ కార కూడా ఇంట్లోకి అడుగు పెట్టింది. దీంతో సోమవారం చిరు ఇంట్లో వినాయకచవితి ఘనంగా జరుపుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను రామ్ చరణ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.












Click it and Unblock the Notifications