కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు కలకలం, తీరా చూస్తే..
ఖమ్మం: శనివారం ఉదయం కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌లో బాంబు పెట్టారన్న వార్తలు స్థానికంగా కలకలం రేపింది. భువనేశ్వర్ నుంచి ముంబైకి వెళ్తున్న రైలు విజయవాడ దాటిన తరువాత సికింద్రాబాద్ దక్షిణ మధ్య రైల్వే కంట్రోల్ బోర్డు నుంచి డ్రైవర్‌కు ఫోన్ వచ్చింది. రైలులో బాంబు ఉందని, అప్రమత్తం కావాలని ఆదేశించారు. దీంతో రైలును ఖమ్మం జిల్లా మధిర రైల్వేస్టేషన్‌లో శనివారం ఉదయం 6.30 గంటల ప్రాంతంలో నిలిపివేశారు.
అప్పటికే ఖమ్మం నుంచి డాగ్‌స్క్వాడ్‌ను పిలిపించారు. ఎస్-11 బోగీలోని సీటు నంబరు 57 కింది భాగంలో సంచి గుర్తించి బయటకు తెచ్చి రైలును పంపించి వేశారు. అందులో నీలి రంగులో ఉన్న 2డబ్బాలను లభ్యమయ్యాయి. ఇవి బాంబులని అనుమానించి మధిర చెరువు ప్రాంతానికి తీసుకెళ్లి జాగిలాలతో పరిశీలించారు. బాంబులా? కావా? నిర్ధరించడానికి నిపుణులను హైదరాబాద్ నుంచి పిలిపించారు.

శనివారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ నుంచి వచ్చిన డాగ్‌స్వ్కాడ్ డీఎస్‌పీ సత్యనారాయణ, రైల్వే సీఐ చంద్రభాను, రైల్వే ఎస్‌ఐ రవికుమార్ ఆధ్వర్యంలో పరిశీలించారు. అనంతరం రాత్రి 10.45గంటల ప్రాంతంలో అందులో నాలుగు రాళ్లు ఉన్నట్లు గుర్తించారు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అయితే, దాడికి పాల్పడేందుకు దుండగులెవరైనా ఈ విధంగా మొదట రెక్కీ ఏమైనా నిర్వహించారా? లేక లేదా ఎవరైనా ఆకతాయిగా చేశారా? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications