మందుబాబులకు షాక్.. మూడు రోజులు వైన్స్ బంద్..!
మందుబాబులకు భారీ షాక్ తగలనుంది. మూడు రోజులపాటు వైన్స్ బంద్ కానున్నాయి. జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నేపథ్యంలో సైబరాబాద్ లో మూడు రోజులపాటు మద్యం దుకాణాలు మూసివేయనున్నారు. నవంబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 మంగళవారం సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, పబ్ లు, రెస్టారెంట్లు మూసివేయనున్నట్లు పోలీసులు ఉత్తర్వులు జారీ చేశారు. అలాగే నవంబర్ 14 ఎన్నికల ఫలితాల నేపథ్యంలో ఆ రోజు కూడా వైన్స్ బంద్ చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
రాష్ట్రంలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికకు రంగం సిద్ధమైంది. నవంబర్ 11 న పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో పోలీసులు, ఎలక్షన్ అధికారులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పోలింగ్ దృష్ట్యా సైబరాబాద్ లో మూడు రోజులపాటు వైన్స్ బంద్ కానున్నట్లు పోలీసులు తెలిపారు. నవంబర్ 9 ఆదివారం సాయంత్రం 6 గంటల నుంచి నవంబర్ 11 సాయంత్రం 6 గంటల వరకు వైన్ షాపులు, బార్లు, పబ్ లు, రెస్టారెంట్లు మూసి వేయనున్నట్లు ఈ మేరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మోహంతీ ఆదేశాలు జారీ చేశారు.

అలాగే నవంబర్ 14 న ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఈ నేపథ్యంలో ఆ రోజు కూడా వైన్ షాప్స్ బంద్ కానున్నట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఈ మేరకు తెలంగాణ ఎక్సైజ్ చట్టం 1968 లోని సెక్షన్ 20 ప్రకారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు.












Click it and Unblock the Notifications