తెలంగాణలో వంటగది.. మహారాష్ట్రలో బెడ్‌రూమ్.. సోషల్ మీడియాలో వింత ఇల్లు వైరల్!
సహజంగా మనం ఇల్లు ఏ రాష్ట్రంలో కట్టుకుంటే ఆ రాష్ట్రానికి పన్ను చెల్లించవలసి ఉంటుంది ఎవరైనా సరే ఇంటి నిర్మాణం చేసుకుంటే ఒకే రాష్ట్రంలో నిర్మాణం చేసుకుంటారు. అయితే ఒక వ్యక్తి మాత్రం రెండు రాష్ట్రాల సరిహద్దులలో నిర్మాణం చేసుకొని రెండు రాష్ట్రాలకు పన్నులు కడుతున్న ఘటన ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మహారాష్ట్ర-తెలంగాణ సరిహద్దు రేఖపై ఉన్న ఒక ఇల్లు చాలా మందిని ఆశ్చర్యపరుస్తోంది. మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లా మహారాజ్‌గూడ గ్రామంలోని ఈ నివాసం ఒకే ఇంట్లో రెండు రాష్ట్రాలను కలిపి ఉంచుతోంది. పవార్ కుటుంబానికి చెందిన ఈ ఇంట్లో మొత్తం పది గదులు ఉన్నాయి. అందులో కొన్ని తెలంగాణ భూభాగంలో, మరికొన్ని మహారాష్ట్ర పరిధిలో ఉన్నాయి.

అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే వంటగది తెలంగాణ వైపు ఉంది. హాల్, బెడ్‌రూమ్‌లు మహారాష్ట్రలో ఉన్నాయి. కుటుంబ సభ్యులు వంట చేయాలంటే తెలంగాణ వైపు వెళ్లాలి. నిద్రపోవాలంటే మహారాష్ట్ర వైపు వెళ్లి పడుకోవాలి. ఇలా రోజువారీ జీవితంలోనే రెండు రాష్ట్రాల సరిహద్దులను దాటుతూ ఉంటారు. ఈ ప్రత్యేక పరిస్థితి కారణంగా ఈ కుటుంబం రెండు రాష్ట్రాలకు ఇంటి పన్నులు చెల్లిస్తోంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ సంక్షేమ పథకాల ప్రయోజనాలు కూడా పొందుతున్నట్లు సమాచారం.
వాహనాలు కూడా రెండు రాష్ట్రాల రిజిస్ట్రేషన్ నంబర్లతో ఉన్నాయని గతంలో వచ్చిన నివేదికలు చెబుతున్నాయి. ఈ ఇల్లు కేవలం ఒక వింత నిర్మాణం మాత్రమే కాదు. రాష్ట్రాల సరిహద్దులలో ఉన్న ప్రజల రోజువారీ జీవితాన్ని ఎలా ప్రభావితం చేస్తుందో చూపించే అరుదైన ఉదాహరణగా నిలుస్తోంది. గతంలో వైరల్ అయిన ఈ ఇంటి ఫోటోలు, మళ్లీ ప్రస్తుతం కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి .
ఏది ఏమైనా తెలంగాణలో వండుకొని తింటూ మహారాష్ట్రలో నిద్రపోతున్న వీరి ఇంటి కథ ఓ వింత కథ. రెండు రాష్ట్రాలకు టాక్స్ లు కడుతున్న[ప్పటికీ, రెండు రాష్ట్రాలకు సంబంధించిన సంక్షేమ పథకాల బెనిఫిట్స్ కూడా వీరు పొందుతూ ఉండడం వలన వీరికి రెండు రాష్ట్రాల సరిహద్దులో ఇల్లు ఉండటం కారణంగా కలిగిన నష్టం ఏమీ లేదన్న అభిప్రాయం ఉంది.













Click it and Unblock the Notifications
