రెండు రోజులు దేవులాట: చివరకి కారులో శవమై..

హైదరాబాద్: ఆడుకుంటూ ఇంటి ఎదుట ఉన్న కారులోకి వెళ్లిన బాలుడు బయటకు రాలేక ఊపిరాడక మరణించాుడ. హైదరాబాద్ కూకట్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలోని గాయత్రినగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రెండ్రోజు ల క్రితం ఇంటివద్ద అదృశ్యమైన తొమ్మిదేండ్ల బాలుడు శవమై కనిపించాడు.

గాయత్రినగర్ కాలనీలో కృష్ణాజిల్లా ఉయ్యూరుకు చెందిన టీ విజయ్‌కుమార్, నదియ దంపతులు నివాసం ఉంటున్నారు. రెండు రోజుల క్రితం ఇంటి ముందు ఆడుకుంటున్న వారి కుమారుడు జాషువ(9) తప్పిపోయాడు, చుట్టు పక్కల గాలించారు. అయితే ఫలితం కనిపించలేదు.

 Boy dies in car in Hyderabad

రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో 25న కూకట్‌పల్లి ఠాణాలో ఫిర్యాదు చేశారు. ఆదివారం సాయంత్రం ఇంటి ముందు నిలిపి ఉన్న కారులో నుంచి దుర్వాసన వస్తుండటంతో కారు మీద కప్పి ఉంచిన కవరు తీసి చూడగా జాషువా అందులో శవమై కనిపించాడు.

సంఘటన స్థలానికి చేరుకున్న కూకట్‌పల్లి పోలీసులు కారులో నుంచి జాషువ మృతదేహాన్ని బయటికి తీసి, శవపరీక్ష నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. రెండు రోజుల క్రితం ఆడుకుంటూ కారులోకి వెళ్లిన జాషువ కారు డోర్లు లాక్ అవడంతో పాటు కారుపై కవర్ కప్పి ఉండటంతో ఊపిరి ఆడక మృతి చెందినట్టు పోలీసులు భావిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+