నా బంగారాన్ని వచ్చే జన్మలో అయినా పెళ్లి చేసుకుంటా..!
ప్రియురాలి మృతిని తట్టుకోలేక ఆ మరుసటి రోజే ప్రియుడు సైతం ఆత్మహత్య చేసుకున్న ఘటన తెలంగాణ వ్యాప్తంగా సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ సూసైడ్ నోట్ లో.. వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లిచేసుకుంటా" రాయడం అతడి కుటుంబ సభ్యలు, బంధువుల్లో తీవ్ర విషాదం నింపుతోంది. ఘట్‌కేసర్ పరిధిలో చోటుచేసుకున్న ఈ హృదయ విదారక ఘటన తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
హిత వర్షిణి ఆత్మహత్య..
మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం కొర్విచల్మకి చెందిన దుంపటి అంజన్న కుమార్తె హిత వర్షిణి. ప్రస్తుతం ఆమె వయస్సు 20 సంవత్సరాలు కాగా.. ఇంజనీరింగ్ చివరి సంవత్సరం చదువుతుంది. సెలవులకు గ్రామానికి వచ్చిన యువతి.. తిరిగి కాలేజీ ప్రారంభం కావడంతో హైదరాబాద్ వచ్చింది. అయితే అకస్మాత్తుగా బీబీనగర్-ఘట్‌కేసర్ మధ్యలోని రైల్వే ట్రాక్ వద్ద ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటన స్థానికులను షాక్‌కు గురిచేసింది.

వినయ్ బాబు ఆత్మహత్య..
అయితే యువతి చివరిసారి తన గ్రామానికి చెందిన వినయ్ బాబు అనే యువకుడితో ఫోన్‌లో మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు. ఈ సమాచారంతో అతని వద్దకు విచారణకు వెళ్లగా.. అప్పటికే అతను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. వినయ్ బాబు సూసైడ్ నోట్‌లో, "వచ్చే జన్మలో అయినా నా బంగారు తల్లిని పెళ్లి చేసుకుంటా" అని రాసి.. తన బాధను వ్యక్తం చేశాడు.
ఇక ప్రాథమిక దర్యాప్తులో హిత వర్షిణి, వినయ్ బాబు కొంతకాలంగా ప్రేమలో ఉన్నారని పోలీసులు నిర్ధారించారు. అయితే ఇద్దరి కుటుంబాలు వారి వివాహానికి అంగీకరించలేదని.. అందుకే వారు తీవ్ర మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకున్నారని భావిస్తున్నారు.
వినయ్ బాబు తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గ్రామస్తుల వాంగ్మూలాలు, యువతీ-యువకుడి కాల్ రికార్డులు, సూసైడ్ నోట్ ఆధారంగా నిజాలను వెలికితీస్తున్నారు.













Click it and Unblock the Notifications