మగాడిలా మాయమై మగువలా తిరిగి ప్రత్యక్షం

Boy turns into woamn in Karimnagar district
కరీంనగర్: ఇష్టం లేకుండా పెళ్లి చేసి కుటుంబ సభ్యులు వేధించడంతో ఓ యువకుడు ఏడాది కిందట ఇంట్లోంచి వెళ్లి మగువలా మారి పోలీస్‌ స్టేషన్‌‌లో ప్రత్యక్షమయ్యాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా ఎల్లారెడ్డిపేట మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. లకావత్ సురేష్‌గా ఇంటి నుంచి పారిపోయి, లతగా తిరిగి వచ్చాడు.

పోలీసుల కథనం ప్రకారం - ఎల్లారెడ్డి మండలంలోని వీర్నపల్లి తండాకు చెందిన లకావత్‌ రాంచంద్రం - శకుంతల దంపతులకు ముగ్గురు కొడుకులు వీరిలో రెండవ కుమారుడు సురేశ్‌ ప్రవర్తన చిన్నతనం నుంచే అమ్మాయిలా ఉండేది. కొంతకాలం క్రితం తల్లిదండ్రులు ఓ హత్య కేసులో జైలుకు వెళ్ళడంతో సురేశ్‌ తన సోదరుడు రాజు వద్దే ఉన్నాడు. అదే సమయంలోనే రాజు సోదరుడు సురేశ్‌కు ఇష్టం లేకున్నా మండలంలోని గుండారం గ్రామానికి చెందిన ఓ యువతితో వివాహం జరిపించారు.

సురేశ్‌ను తన ప్రవర్తన మార్చుకోమంటూ తరచూ తన సోదరుడు తనను తన భార్య ముందే కొట్టడం, తిట్టడం చేస్తుంటే సురేశ్‌ దంపతుల మధ్య విభేధాలు వచ్చాయి. దీంతో కొద్ది రోజులు సురేష్ భార్య తన పుట్టింటికి వెళ్ళిపోయింది. దీంతో తీవ్ర మనస్థాపానికి గురైన సురేష్‌ నిరుడు నవంబర్‌ 21న ఇంట్లో భార్యతో గొడవపెట్టుకొని బయటకు వెళ్ళిపోయాడు. అతనికోసం తిరిగిన కుటుంబీకులు డి సెంబర్‌ 6న పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

అయితే, శుక్రవారం హిజ్రాగా మారిన సురేశ్‌ లత పేరుతో పోలీస్‌ స్టేషన్‌కు వచ్చాడు. హిజ్రాగా మారాల్సిన అవసరం ఎందుకు వచ్చిందనే మీడియా ప్రతినిధులు సురేశ్‌ను ప్రశ్నించారు. తనను సోదరుడు రాజు పెడుతున్న బాధలు భరించలేక, ఇష్టం లేదని చెప్పినా వినకుండా వివాహం చేయడంతో గత నవంబర్‌లో ఇంట్లోంచి వెళ్లిన తాను నిజామాబాద్‌లో ఒక హి జ్రా సహాయంతో బొంబాయికి వెళ్ళి అక్కడ లింగమార్పిడి చేయించుకుని తన పేరును లతగా మార్చుకున్నానని తెలిపా

డు. ఈ పది నెలల కాలంలో తాను మహారాష్ట్ర బల్హార్షాలోని చంద్రాపూర్‌లో ఉంటూ హిజ్రాగా జీవనాన్ని కొనసాగించానని తెలియజేశాడు. అప్పుడప్పు డూ తన తల్లితో ఫోన్‌లో మాట్లాడినట్లు తెలిపాడు. తన తల్లి సమాచారం మేరకు పోలీసుల వ ద్దకు వచ్చినట్లు తెలిపాడు. తాను జీవితాంతం ఇలాగే ఉంటానని చెప్పాడు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+