ప్రేమ పేరుతో మోసం, అమ్మాయితో వీడియో షేర్
ఖమ్మం: తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఫార్మసీ విద్యార్థినిని ప్రేమపేరుతో మోసం చేసిన యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడు హుస్సేన్ అలీతో పాటు అతడి స్నేహితులు మరో ఇద్దరిని జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో ప్రత్యేక విచారణాధికారిగా నియమితులైన సీఐ శ్రీధర్, డీఎస్పీ దక్షిణామూర్తి కలిసి శుక్రవారం నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టారు.
కొత్తగూడెంలోని ఫార్మసీ కళాశాలలో చదువుతున్న విద్యార్థినిని హుస్సేన్ ప్రేమిస్తున్నాంటూ మాయమాటలు చెప్పి లోబరుచుకున్నాడు. అంతేకాకుండా అమ్మాయితో ఉన్న చిత్రాలను వీడియో తీసి వాటిని స్నేహితులకు షేర్ చేశాడు. దీంతో వారు సైతం యువతిని అనేక విధాలుగా వేధింపులకు గురిచేశారు. నాలుగు రోజుల పాటు విచారణ జరిపిన సీఐ ప్రధాన నిందితుడు హుస్సేన్ అలీతో పాటు సునీల్, రెహ్మాన్ అనే ఇద్దరు స్నేహితులను అరెస్ట్ చేశారు.

ఈ కేసులో మొత్తం నలుగురు నిందితులను గుర్తించిన పోలీసులు ముగ్గురిని అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో స్నేహితుడు మనోజ్ కోసం గాలిస్తున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు. నిందితుల నుంచి రెండు సెల్‌ఫోన్లు, యువతికి చెందిన రూ. 2 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు.
ముగ్గురిపై 376,384 సెక్షన్లతో పాటు ఐటీ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు. వీరందిని నేడు ఆధారాలతో సహా కోర్టులో హాజరుపర్చనున్నట్లు డీఎస్పీ దక్షిణామూర్తి తెలిపారు.












Click it and Unblock the Notifications