మందుబాబులకు ఊరట:హైకోర్టు కీలక తీర్పు..!!
మద్యం సేవించి వాహనం నడపడం నేరం. మద్యం సేవించి వాహనం నడపడం వల్ల సేవించిన వ్యక్తికే కాకుండా తనతో పాటు ప్రయాణించే వారికి కూడా ప్రమాదమే. "Don't Drink And Drive"అంటూ పలుచోట్ల మనకు బోర్డులు కూడా కనిపిస్తుంటాయి. అంతేకాదు ప్రభుత్వాలు కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ పై పలు చట్టాలు కూడా తీసుకొచ్చాయి. అయినపట్టికీ కొందరు వీటిని పెడిచెవిన పెట్టి తమకు తోచిందే చేసి మద్యం సేవించి వాహనం నడుపుతుంటారు. ఇలా ప్రమాదాల బారిన పడుతుంటారు. ప్రాణాలపైకి తెచ్చుకుంటుంటారు.
మద్యం సేవించి వాహనాలు నడిపేవారిపై ప్రభుత్వాలు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి వాహనదారులను పోలీసులు తనిఖీ చేస్తుంటారు. ఇందులో భాగంగా బ్రీత్ అనలైజర్ టెస్టును నిర్వహిస్తుంటారు. ప్రభుత్వ సంస్థలు నిర్ణయించిన మోతాదు కంటే ఎక్కువగా సేవించినట్లయితే ఆ వాహనదారుడు లేదా డ్రైవర్ పై కేసు నమోదు చేస్తుంటారు పోలీసులు. ఆ తర్వాత పోలీస్ స్టేషన్లు కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తుంది. తాజాగా మద్యం సేవించిన మందుబాబులపై హైకోర్టు ఇచ్చిన తీర్పు ఆలోచింపజేస్తోంది.

బ్రీత్ అనలైజర్ టెస్టు మాత్రమే కాదు..
తెలంగాణ హైకోర్టు బ్రీత్ అనలైజర్ టెస్టు పై కీలక వ్యాఖ్యలు చేసింది.ఒక వ్యక్తిపై బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించి అతను మద్యం సేవించాడని నిర్థారించడాన్ని న్యాయస్థానం తప్పుబట్టింది. కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతోనే ఫలానా వ్యక్తి మద్యం సేవించాడని కేసు నమోదు చేయడం సబబు కాదని వ్యాఖ్యానించింది. అది కేవలం ప్రాథమిక నిర్థారణ కోసమే అని పేర్కొంది. ఆ తర్వాత యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టులు నిర్వహించి అక్కడ వచ్చిన ఫలితం ఆధారంగా వ్యక్తి మద్యం సేవించాడా లేదా అనేది నిర్థారించాలని కోర్టు స్పష్టం చేసింది.
మధిరకు చెందిన డ్రైవర్ పిటిషన్
ఇక అసలు విషయానికొస్తే.. ఖమ్మం జిల్లా మధిరికు చెందిన వెంకటి అనే వ్యక్తి మధిర టీజీఎస్‌ఆర్టీసీ డిపోలో డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. అయితే తాను మద్యం సేవించాడన్న కారణంగా అతన్ని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం విధుల నుంచి డిస్మిస్ చేసింది. అంతేకాదు మద్యం సేవించి ఖమ్మం డిపో ఎదుట ఓ నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారంటూ ఆర్టీసీ యాజమాన్యం ఆరోపణలు చేసింది. దీనివల్ల టీజీఎస్‌ఆర్టీసీకి రూ.18,532 నష్టం వాటిల్లడంతో పాటు ఆర్టీసీ ప్రతిష్టను దెబ్బతీసిందని డిస్మిస్ ఆర్డర్‌లో పేర్కొంది. అంతేకాదు వెంకటికి బ్రీత్ అనలైజర్ టెస్టు నిర్వహించగా 329/100ml రీడింగ్ చూపించిందని వివరించింది.అందుకే అతనిపై క్రమశిక్షణాచర్యలు తీసుకున్నట్లు వెల్లడించింది. ఇది అన్యాయమంటూ వెంకటి హైకోర్టును న్యాయం కోరుతూ ఆశ్రయించాడు.
వెంకటి వేసిన పిటిషన్‌ను స్వీకరించిన న్యాయస్థానం విచారణ చేపట్టింది. ఈ నేపథ్యంలోనే పిటిషన్‌ను విచారణ చేపట్టిన జస్టిస్ నామవరపు రాజేశ్వరరావు 2015 హైకోర్టు తీర్పును ఉటంకిస్తూ.. బ్లడ్ టెస్టు, యూరిన్ టెస్టులు చేయకుండా కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టుతో ఒక వ్యక్తి మద్యం సేవించారని నిర్థారించలేమని వ్యాఖ్యానించారు. డ్రైవర్‌గా పనిచేస్తున్న వెంకటిని కేవలం బ్రీత్ అనలైజర్ టెస్టు ద్వారా మద్యం సేవించాడని నిర్థారిస్తూ ఉద్యోగం నుంచి డిస్మిస్ చేయడం సబబు కాదని పేర్కొన్నారు. తదుపరి మెడికల్ ఎగ్జామినేషన్స్ కోసం మాత్రమే బ్రీత్ అనలైజర్ టెస్టును ప్రాథమికంగా తీసుకోవాలని సూచించారు.
-
జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరిక వేళ బీజేపీ బిగ్ ట్విస్ట్, రూట్ క్లియర్..!! -
ఇంటర్ ఫలితాల ముహూర్తం ఖరారు : వేసవి సెలవుల పై తాజా ఉత్తర్వులు..!! -
దేవాన్ష్ పేరిట తిరుమలలో ఆ రోజు ఖర్చు మొత్తం చంద్రబాబుదే, స్వయంగా..!! -
సీఎం తొలి సంతకం.. పేదల కోసం వరాల ఉగాది! -
LPG కొరత తీవ్రం-కేంద్రం ప్రకటన-వినియోగదారులకు కీలక సూచనలు..! -
వృషభరాశి, సింహరాశి, వృశ్చిక రాశి, మకర రాశులకు ఏప్రిల్ 19 నుంచి మాలవ్య రాజయోగం -
Dhurandhar 2 Review:"భాయ్" తేల్చేశాడు భయ్యా...బన్నీ ఫ్యాన్స్ గెట్ రెడీ..!! -
Today Rasi Phalalu March 19th: ఉగాది రోజున ఎవరికి యోగం?ఎవరికి హెచ్చరిక?మీ రాశి ఫలం ఇక్కడే! -
కేంద్రీయ విద్యాలయాల్లో అడ్మిషన్ల జాతర! వెంటనే అప్లై చేయండి -
సీఎం రేవంత్ రెడ్డి జాతకం చూశారా? ఇక ప్రత్యర్థులకు చుక్కలే! -
30 ఏళ్లలో ఎన్నడూ లేనంత చిన్నదిగా.. 2060 నాటికి ఓజోన్ పొర.. -
ట్రంప్ చెప్పినా వినని పావెల్! వడ్డీ రేట్ల యథాతథం!












Click it and Unblock the Notifications