పెళ్ళి ఆలస్యమైందంటూ పురోహితుడిపై వధువు బంధువు దాడి, ఆసుపత్రిలో పురోహితుడు

Posted By:
Subscribe to Oneindia Telugu

కరీంనగర్: పెళ్ళి ఆలస్యానికి కారణమయ్యారంటూ పురోహితుడిపై వధువు బంధువులు దాడికి దిగారు. అయితే ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన పురోహితుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ లో చోటుచేసుకొంది.

కరీంనగర్ జిల్లా బసంత్ నగర్ కు చెందిన రాజయ్య కూతురు వివాహం జరిపించేందుకుగాను పాలకుర్తికి చెందిన స్థానిక కోదండ రామాలయ పూజారి సేనాపతి వెంకటరమణాచారి వెళ్ళారు.

అయితే ముహుర్త సమయాని కటే వివాహం ఆలస్యమైంది.అయితే వివాహం ఆలస్యమైందనే విషయాన్ని మద్యం సేవించి వచ్చిన వధువు తరపు బంధువు పురోహితుడితో గొడవకు దిగాడు.

bride relatives attacked on priest in karimnagar

దీంతో పురోహితుడితో ఆయన వాగ్వావాదానికి దిగాడు. కొద్దిసేపు వివాహ తంతు ఆపాల్సి వచ్చింది.ఇరువైపులా బంధువులు సర్ధిచెప్పి వివాహ తంతును కొనసాగించారు.

వివాహం పూర్తైన తర్వాత చొప్పదండి మండలకేంద్రానికి చెందిన వధువు తరపు బంధువు పురోహితుడిపై కర్రతో దాడి చేసి పిడిగుద్దులు గుద్దాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే చికిత్స నిమిత్తం ఆయనను పెద్దపల్లి ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం కరీంనగర్ తరలించాలని వైద్యులు సూచించారు. విషయం తెలిసిన బసంత్ నగర్ పోలీసులు సంఘటనపై విచారణ నిర్వహిస్తున్నారు.

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
bride relatives attacked on priest for delaying marriage on saturday in karimnagar district.
Please Wait while comments are loading...