టెక్సాస్ రోడ్డు ప్రమాదం: ముగ్గురు తెలుగువారి మృతదేహాలను స్వదేశం తరలించండి, కేంద్రానికి లక్ష్మణ్ లేఖ
అమెరికా రోడ్డు ప్రమాదంలో చనిపోయిన ముగ్గురు తెలుగు వారిని స్వదేశం తరలించేందుకు చర్యలు చేపట్టాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ కోరారు. ఈ మేరకు విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్‌కు లేఖ రాశారు. హైదరాబాద్‌కు చెందిన రాజా గవిని(41), దివ్య ఆవుల (34)తోపాటు రాజా స్నేహితుడు ఏపీకి చెందిన ప్రేమనాథం రామనాథ్‌తో కలిసి ప్రయాణిస్తోండగా టెక్సాస్‌లో సోమవారం ఉదయం కారు ప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే చనిపోవడంతో వారి ఇంటి వద్ద విషాదఛాయలు అలుముకున్నాయి.

కేంద్రానికి లేఖ
మృతుల బంధువుల విజ్ఞప్తి మేరకు కేంద్రానికి లేఖ రాసినట్టు లక్ష్మణ్ వివరించారు. అమెరికాలోని రాయబార కార్యాలయ అధికారులతో సంప్రదింపులు జరిపి.. మృతదేహాలను వీలైనంత తర్వగా భారత్ తరలించాలని లక్ష్మణ్ కోరారు. ఇదే అంశంపై కేంద్ర హోంశాఖ సహాయమంత్రి కిషన్‌రెడ్డికి కూడా లక్ష్మణ్ లేఖ రాశారు.

ప్రమాదంతో
ముషీరాబాద్ గాంధీనగర్‌కు చెందిన రాజా గవిని, దివ్య ఆవుల భార్యాభర్తలు. వీరిద్దరూ అమెరికా టెక్సాస్‌లోని ప్రిస్కోలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లుగా విధులు నిర్వహిస్తూ అక్కడే ఉంటున్నారు. సోమవారం ఉదయం తమ కుమార్తె రియాను డ్యాన్స్ క్లాస్ వద్ద విడిచి పెట్టారు. అనంతరం అక్కడ్నుంచి తిరిగి వస్తున్న క్రమంలో స్థానికంగా నిర్మాణం చేపట్టిన తమ సొంత ఇంటిని పరిశీలించేందుకు స్నేహితుడు ప్రేమ్‌నాథ్ రామనాథంను తమ వెంట కారులో తీసుకెళ్లారు.
Recommended Video


ముగ్గురి మృతి
ఎఫ్ఎం 423 ఇంటర్ సెక్షన్ వద్దకు రాగానే ఈ ముగ్గురూ వెళ్తున్న కారును ఓ ట్రక్ వేగంగా ఢీకొట్టింది. దీంతో ఈ ముగ్గురూ కూడా అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న స్థానిక పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులు రాజా, దివ్యల మృతితో రియా ఒంటరిగా మారిపోయింది. అమెరికాలోనే స్థిరపడి ఇల్లు కూడా కట్టుకుంటున్న దంపతులు.. ఎంతో ఆనందంగా జీవితం గడిచిపోతుందనుకుంటున్న తరుణంలో ఈ ప్రమాదం జరగడం పెను విషాదాన్ని నింపింది. ఈ ఘోర ప్రమాదం మూడు తెలుగు కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
-
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
బంగారం ధరలు అధోగతి- కనీవినీ ఎరుగనంత పతనం -
PM Modi: అన్నింటికీ సిద్దం అయిపోండి..! ప్రధాని మోడీ షాకింగ్ పిలుపు..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
ప్రతీ ఇంటికీ రెండు ఫ్రీ గ్యాస్ సిలెండర్లు-ఇరాన్ వార్ వేళ సర్కార్ ఆఫర్..! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
ఏపీలో ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్..! ఇకపై ఈ మార్పు..! -
తమిళనాడులో సీన్ రివర్స్-తాజా సర్వేలో హోరాహోరీ-ఎడ్జ్ మాత్రం..! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
ధనుస్సు రాశి, మకర రాశి ఏప్రిల్ నెల జాతక ఫలం -
తెలంగాణ కేబినెట్ సంచలన నిర్ణయాలు.. ఆ బిల్లులకు ఆమోదం












Click it and Unblock the Notifications