వరంగల్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తగ్గేదేలే: వైఎస్ షర్మిల ఫైటర్ అంటూ బ్రదర్ అనిల్, కోర్టుకు వైటీపీ అధినేత్రి తరలింపు

|
Google Oneindia TeluguNews

హైదరాబాద్: వైయస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిలను అరెస్టు చేయడంపై ఆమె భర్త బ్రదర్ అనిల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పాదయాత్ర చేస్తున్న మహిళపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టారని మండిపడ్డారు. మంగళవారం సాయంత్రం పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో వైఎస్ షర్మిలను అనిల్ పరామర్శించారు.

పాదయాత్ర దాడులు, అరెస్టులా?: షర్మిల భర్త అనిల్ ఫైర్

పాదయాత్ర దాడులు, అరెస్టులా?: షర్మిల భర్త అనిల్ ఫైర్

ఈ సందర్భంగా బ్రదర్ అనిల్ మాట్లాడుతూ.. వైయస్సార్ తెలంగాణ పార్టీ వాహనాలు ధ్వంసం చేసిన వారిపై మాత్రం కేసులు పెట్టలేదని, బాధితులపైనే పోలీసులు పెట్టారని ఆరోపించారు. పోలీసులు పెట్టిన కేసులపై న్యాయపరంగా పోరాడుతామని స్పష్టం చేశారు. షర్మిల ఫైటర్.. తగ్గేదేలే అని వ్యాఖ్యానించారు అనిల్. షర్మిలపై సెక్షన్లలో ఒక్కటైనా పోలీసులు రుజువు చేస్తారా? అని అనిల్ ప్రశ్నించారు. ప్రజల సమస్యలను తెలుసుకునేందుకు వెళితే దాడులు చేస్తారా? అని నిలదీశారు.

షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు

షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించిన పోలీసులు

ఇది ఇలావుంగా, భారీ బందోబస్తు మధ్య షర్మిలను పంజాగుట్ట పోలీసులు న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చారు. ప్రగతి‌భవన్ ముట్టడికి కారులో ఆమె వెళ్తుండగా.. పోలీసులు పంజాగుట్ట చౌరస్తా వద్ద అడ్డుకున్నారు. ట్రాఫిక్ ఇబ్బందులు సృష్టించారని, అధికారుల విధులకు ఆటంకం కలిగించారని షర్మిలతోపాటు మరో ఐదుగురి వైయస్సార్ తెలంగాణ పార్టీ నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఆర్ నగర్‌లోని ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం షర్మిలను నాంపల్లి కోర్టుకు తరలించారు. ఈ సందర్భంగా కోర్టు వద్ద కూడా భారీ భద్రత ఏర్పాటు చేశారు.

షర్మిల వచ్చే వరకూ దీక్ష అంటూ వైఎస్ విజయమ్మ

షర్మిల వచ్చే వరకూ దీక్ష అంటూ వైఎస్ విజయమ్మ

మరోవైపు, షర్మిల అరెస్టును నిరసిస్తూ ఆమె తల్లి వైఎస్ విజయమ్మ తమ నివాసం లోటస్ పాండ్‌లోనే నిరాహార దీక్ష చేస్తున్నారు. ఆమెను షర్మిలను కలిసేందుకు వెళుతుండగా.. పోలీసులు హౌస్ అరెస్టు చేశారు. దీంతో ఆమె ఇంట్లోనే దీక్ష చేస్తున్నారు. షర్మిల వచ్చే వరకు తన దీక్ష కొనసాగుతుందని చెప్పారు. విమర్శలు చేస్తే దాడులు, అరెస్టులు చేస్తారా? అని మండిపడ్డారు. కాగా, వరంగల్ జిల్లాలో సోమవారం పాదయాత్ర చేస్తుండగా టీఆర్ఎస్ శ్రేణులు వైటీపీ వాహనాలపై రాళ్ల దాడి చేశారు. షర్మిల్ కేరవాన్ కు నిప్పుపెట్టారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితి తలెత్తడంతో షర్మిలను అరెస్ట్ చేసి హైదరాబాద్ తరలించారు పోలీసులు. ఈ క్రమంలోనే ఆమె మంగళవారం ప్రగతిభవన్‌కు బయల్దేరగా మరోసారి అరెస్ట్ చేశారు.

English summary
Brother Anil responded on YS Sharmila arrest issue .
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X