ద‌స‌రాకు చెల్లిని పుట్టింటికి తీసుకొస్తుండ‌గా మృత్యువులా దూసుకొచ్చిన థార్.. అన్నాచెల్లెళ్లు స్పాట్ డెడ్

పండగ పూట తీవ్ర విషాదం నెలకొంది. హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై హయత్‌ నగర్ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై వెళ్తున్న అన్నాచెల్లెళ్లను ఓవర్ స్పీడ్ తో వస్తున్న థార్ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరూ మృతి చెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మృతి చెందిన వాళ్లు పెద్దఅంబర్‌ పేట్‌ కు చెందిన రేఖ, నవీన్​ గా గుర్తించారు. అక్కను దసరాకు శంషాబాద్ నుంచి తీసుకువస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో కారు డ్రైవర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇక ఘ‌ట‌నా స్థ‌లంలోనే అన్నాచెల్లెళ్లు ప్రాణాలు కోల్పోవ‌డంతో బాధిత కుటుంబ స‌భ్యులు రోద‌న‌లు మిన్నంటాయి. అటు వారి స్వగ్రామంలోనూ విషాద ఛాయలు అలుముకున్నాయి.

సద్దుల బతుకమ్మ పండుగకు మరికొద్ది గంటల్లో సంబరాలు ప్రారంభం కానున్న వేళ ఆ ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన అన్నాచెల్లెళ్లు మృతి చెందడంతో ఆ కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అవుతున్నారు. ఈ ఘటన హైదరాబాద్ లోని హయత్ నగర్ సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళ్తే..రంగారెడ్డి జిల్లా పెద్ద అంబర్‌ పేట్ కు చెందిన నవీన్, రేఖ అన్నాచెల్లెళ్లు. దసరా పండగ కావడంతో కుటుంబ సభ్యులతో గడిపేందుకు ఎల్బీనగర్ నుంచి స్వగ్రామానికి తమ స్కూటీపై బయలుదేరారు.

brother was bringing his sister home for the Dasara both siblings died on the spot accident in hyd

వీరితో పాటు నాలుగేళ్ల కుమార్తె కూడా ఉంది. స్కూటీ హయత్‌ నగర్ సమీపంలోకి రాగానే.. అత్యంత వేగంగా దూసుకొచ్చిన థార్ వాహనం వీరిని బలంగా ఢీకొట్టింది. దీంతో న‌వీన్, రేఖ ఘ‌ట‌నా స్థ‌లంలోనే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయ‌ప‌డిన చిన్నారిని స్థానికులు చికిత్స నిమిత్తం స‌మీపంలోని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. అయితే ప్రస్తుతం చిన్నారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం అందుతోంది. ఈ రోడ్డు ప్రమాదం కారణంగా విజయవాడ జాతీయ రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఇక సమాచారం అందుకున్న హయత్‌ నగర్ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పోస్ట్‌ మార్టం నిమిత్తం ఉస్మానియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అలగే హైవేపై ట్రాఫిక్‌ ను పునరుద్ధరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+