చంద్రబాబు నిర్ణయంతో కేసీఆర్ సైతం, బిగ్ డెసిషన్..!!
మాజీ ముఖ్యమంత్రి...బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. ఇటీవల మొయినా బాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో పట్టుబడి అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్- బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి వ్యవహారం రాజకీయంగా సంచలనంగా మారింది. ఈ వ్వవహారం పైన పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నారు. రాజకీయంగా ఈ అంశం వివాదాస్పదంగా మారింది. ఈ క్రమంలో పైలెట్ రోహిత్ రెడ్డి పైన మాజీ సీఎం కేసీఆర్ అనూహ్య నిర్ణయం తీసుకున్నారు.
ఇటీవల మొయినాబాద్ ఫామ్ హౌస్ కేసులో డ్రగ్స్ తీసుకున్నారనే ఆరోపణలతో అరెస్ట్ అయిన టీడీపీ ఎంపీ పుట్టా మహేష్ .. బీఆర్ఎస్ నేత రోహిత్ రెడ్డి పైన రాజకీయంగా విమర్శలు తీవ్ర స్థాయి లో మొదలయ్యాయి. ఈ క్రమంలో ఎంపీ పుట్టా మహేష్ ను పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలి అంటూ టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశించారు. ఈ వ్యవహారం తేలే వరకూ ఈ ఆదేశాలు అమల్లో ఉంటాయని తేల్చి చెప్పారు. దీంతో, ఇక ఇప్పుడు బీఆర్ఎస్ సైతం ఇదే తరహా నిర్ణయం తీసుకుంది. బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డికి బీఆర్‌ఎస్ షోకాజు నోటీసులు జారీ చేసింది. డ్రగ్స్ వినియోగం ఆరోపణలపై షోకాజు నోటీసులు పంపింది. ఏడురోజుల్లోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది. విచారణ పూర్తయ్యేంత వరకూ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండాలని స్పష్టం చేసింది. విచారణ ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని బీఆర్ఎస్ పార్టీ షోకాజ్ నోటీసులో పేర్కొంది.

గత శనివారం మొయినాబాద్ ఫామ్ హౌస్ లో పైలట్ రోహిత్ రెడ్డితో పాటు మరికొందరు డ్రగ్స్ తీసుకుని దొరకడమే కాకుండా పోలీసులపై కాల్పులు జరిగిన ఘటనలో బీఆర్ఎస్ ఈ వివరణ కోరింది. ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి వ్యవహారంపై కేసీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మాదక ద్రవ్యాల వినియోగం ఆరోపణలపై ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేశారు. వారం రోజుల్లోగా మీడియా ద్వారా వచ్చిన ఆరోపణలపై స్పష్టంగా లిఖితపూర్వక వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేశారు. షోకాజ్ నోటీసుకు గడువులోపు వివరణ సమర్పించడంలో విఫలమైతే పార్టీ నియమావళి ప్రకారం వేటు వేసేందుకు కూడా వెనుకాడబోమని లేఖలో హెచ్చరికలు పంపారు. ఆ పార్టీలో ఉన్న ఐదుగురికి నిర్వహించిన డ్రగ్స్ పరీక్షల్లో పైలట్ రోహిత్ రెడ్డికి పాజిటివ్ అని తేలింది. పోలీసులు లోపలికి ప్రవేశించగానే ఢిల్లీకి చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి నమిత్ శర్మ గాల్లోకి ఒక రౌండ్ కాల్పులు జరిపారు. ఆ గన్ రోహిత్ రెడ్డి తమ్ముడు రితేష్ రెడ్డిది కాగా, లైసెన్స్ ఉన్నప్పటికీ మరొకరు కాల్పులు జరపడం తీవ్ర ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.
-
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..!












Click it and Unblock the Notifications