కౌంట్ డౌన్ షురూ - గ్రేటర్ పీఠం నిలిచేనా, బిగ్ ట్విస్ట్..!!

గ్రేటర్ హైదరాబాద్ రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. మేయర్ పైన అవిశ్వాసం పైన చర్చ కీలక మలుపు తీసుకుంది. బీఆర్ఎస్ అవిశ్వాసం పైన వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. బీఆర్ఎస్ కు ధీటుగా రేవంత్ టీం కొత్త యాక్షన్ ప్లాన్ సిద్దం చేస్తోంది. అవిశ్వాసం పెట్టేందుకు ఈ నెల 11 తరువాత అవకాశం దక్కుతుంది. దీంతో, బీఆర్ఎస్ క్యాంప్ లో ఆసక్తి కర పరిణామాలు చోటు చేసు కొంటున్నాయి. మరి.. అవిశ్వాస తీర్మానం ప్రతిసాదిస్తారా.. సాధ్యమేనా.. ఏం జరుగుతోంది..

గ్రేటర్‌ హైదరాబాద్‌ మునిసిపల్‌ కార్పొరేషన్‌ కేంద్రంగా ఆసక్తి కర పరిణామాలు చోటు చేసుకుంటు న్నాయి. మేయర్ పై అవిశ్వాసం దిశగా బీఆర్ఎస్ పావులు కదుపుతోంది. రేపు (ఫిబ్రవరి 11) గ్రేటర్ పాలక మండలికి నాలుగేళ్లు పూర్తి కానుంది. దీంతో, 11వ తేదీ తరువాత ఎప్పుడైనా అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టేందుకు అవకాశం దక్కుతుంది. బీఆర్ఎస్ ఇప్పటికే జీహెచ్ఎంసీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి, డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలత శోభన్‌ రెడ్డిలపై అవిశ్వాసం పెట్టేందుకు కసరత్తు ప్రారంభించింది. దీంతో, గ్రేటర్ లో పార్టీల బలా బలాలు కీలకంగా మారుతున్నాయి.

BRS has decided to initiate a no-confidence motion against GHMC mayor as reports

ఇదే సమయంలో బీజేపీ కార్పోరేటర్లతో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సమావేశం ఆసక్తి కరంగా మారింది. మాజీ మంత్రి కేటీఆర్‌తో బీఆర్ఎస్ కార్పొరేటర్లు సమావేశం ఫిక్స్ అయింది. అవిశ్వాసం పెట్టాలని గులాబీ కార్పోరేటర్లు డిమాండ్ చేస్తున్నారు. బీజేపీ, బీఆర్ఎస్ మంత్రాంగంతో కాంగ్రెస్ అప్రమత్తం అయింది. మంగళవారం కాంగ్రెస్ కార్పోరేటర్లతో మేయర్ సమావేశం కానున్నారు. తమ పార్టీ తరఫున కార్పొరేటర్‌గా గెలిచి జీహెచ్‌ఎంసీ మేయర్‌ పదవిని చేపట్టిన విజయలక్ష్మి కాంగ్రెస్‌లోకి మారటంతో బీఆర్ఎస్ ఈ అవిశ్వాస తీర్మానం పైన ఆలోచన చేస్తోంది.

ఇందుకు సంబంధించి సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తోంది. బలబలాల పైన సమీక్షించారు. అవిశ్వాసం పెడితే గెలిచే అవకాశం ఉందా.. ఎవరెవరు మద్దతిస్తారనేది చర్చించారు. అయితే, అటు ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల పైన నిర్ణయం తీసుకుంటుందనే చర్చ వేళ బీఆర్ఎస్ ఆచితూచి వ్యవహరించా లని భావిస్తోంది. దీంతో.. గ్రేటర్ రాజకీయం పైన ఉత్కంఠ కొనసాగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+