Telangana Assembly Elections 2023: ముందున్న బీఆర్ఎస్.. వెనకబడ్డ కాంగ్రెస్, బీజేపీ..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నగారా మోగింది. నవంబర్ 3 నుంచి నామినేషన్లు స్వీకరించనున్నారు. నామినేషన్ల సమర్పణకు నవంబర్ 10 చివరి తేదీగా ఉంది. నవంబర్ 13న నామినేషన్ల స్క్రూటీని ఉంది. నవంబర్ 15న నామినేషన్ల విత్ డ్రా కు గడువు విధించారు. నవంబర్ 30న పోలింగ్ జరగనుండగా.. డిసెంబర్ 3న ఫలితాలు వెల్లడిస్తారు. నేటి నుంచి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చింది.
ఇక అభ్యర్థుల ఎంపిక, ప్రచారం విషయానికొస్తే.. అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంలో బీఆర్ఎస్ ముందుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఇప్పటికే 115 మందితో అభ్యర్థుల జాబితా విడుదల చేశారు. మంత్రులు కేటీఆర్, హరీశ్ రావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. రోజుకు రెండు, మూడు కార్యక్రమాల్లో పాల్గొంటూ ఊపు మీద ఉన్నారు. తెలంగాణలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు. మరోసారి బీఆర్ఎస్ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేస్తున్నారు.

ఇక కాంగ్రెస్, బీజేపీలు అభ్యర్థుల ఎంపిక వద్దే ఉన్నారు. కాంగ్రెస్ అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. ఇప్పటికే 50 మంది అభ్యర్థులను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఆ అభ్యర్థులకు సమాచారం కూడా ఇచ్చినట్ల తెలుస్తోంది. దీంతో వారు క్షేత్రస్థాయిలో ప్రచారం చేస్తున్నారు. మిగిలిన 50 శాతం అభ్యర్థల ఎంపికపై కాంగ్రెస్ స్క్రీనింగ్ కమిటీ కసరత్తు చేస్తోంది.
అటు బీజేపీ కూడా అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. త్వరలో బీజేపీ తన మొదటి జాబితా విడుదల చేసే అవకాశం ఉంది. ప్రచారం విషయానికొస్తే ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణలో ఇప్పటికే రెండుసార్లు పర్యటించారు. తెలంగాణకు పసుపు బోర్డుతో పాటు, గిరిజన యూనివర్సిటీని కూడా ప్రకటించారు. త్వరలో తెలంగాణలో అమిత్ షా కూడా పర్యటించనున్నారు.
మరో వైపు బీఎస్పీ కూడా తన మొదటి అభ్యర్థుల జాబితా విడుదల చేసింది. మొత్తానికి బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికతో పాటు ప్రచారంలో ముందుంది. అయితే కొన్ని సర్వే ఫలితాలు మాత్రం కాంగ్రెస్ కే అనుకూంగా ఉన్నట్లు చెబుతున్నాయి. కొన్ని రోజుల క్రితం లోక్ పోల్ తన సర్వే ఫలితాలు విడుదల చేసింది. ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ అత్యధిక సీట్లు గెలుస్తుందని అంచనా వేసింది. రెండో స్థానంలో బీఆర్ఎస్ ఉంటుందని పేర్కొంది.












Click it and Unblock the Notifications