హరీశ్ రావుకు అస్వస్థత.. హుటాహుటిన కిమ్స్ ఆస్పత్రికి తరలింపు
తెలంగాణ మాజీ వ్యవసాయ శాఖ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను హుటాహుటిన సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్య చికిత్స చేస్తున్నారు. ఈ రోజు ఉదయం నుంచే హరీశ్ రావు అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. అధిక జ్వరంతో ఆయన తీవ్ర ఇబ్బంది పడినట్లు తెలుస్తోంది. దీంతో ఆయన్ను కుటుంబ సభ్యులు వెంటనే సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించారు.
మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ను సికింద్రాబాద్ లోని కిమ్స్ ఆస్పత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు. ఆయనకు అధిక జ్వరం ఉన్నట్లు అక్కడి వైద్యులు తెలిపారు. ప్రస్తుతం చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు సమాచారం. మరోవైపు కేటీఆర్ కూడా హరీష్ రావును పరామర్శించడానికి ఆసుపత్రికి వెళ్ళనున్నారు.
ఇవాళ ఉదయం నుంచే హరీశ్ రావు అనారోగ్యంతో ఉన్నట్లు సమాచారం. అధిక జ్వరంతో ఆయన బాధపడుతున్నట్లు తెలుస్తోంది. కేటీఆర్ ఏసీబీ విచారణ అనంతరం తెలంగాణ భవన్ కు వచ్చినప్పుడు, హరీష్ రావు స్వాగతం పలికారు. అనంతరం ఆ సమావేశంలో కొద్దిసేపు ఉండి అనారోగ్యంతో మధ్యలోనే అక్కడి నుంచి వెళ్లిపోయారు.

ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీలో జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో.. పార్టీ ఎదుర్కొంటున్న ఒత్తిళ్ల కారణంగా హరీశ్ రావు అస్వస్థతకు గురై ఉండొచ్చని పలువురు అభిప్రాయ పడుతున్నారు.












Click it and Unblock the Notifications