బేషరతుగా తొలిగించకుంటే, ఇక - హరీష్ హెచ్చరిక..!!
మాజీ మంత్రి హరీష్ రావు కాంగ్రెస్ ప్రభుత్వానికి హెచ్చరిక చేసారు. సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ప్రజల ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ లేదని విమర్శించారు. ప్రభుత్వం మెడలు వంచి బాధితు లకు న్యాయం చేసే బాధ్యత తమపై ఉందని చెప్పారు. బాధితులకు న్యాయం చేయకుంటే తాము పోరాటానికి సిద్దమని వెల్లడించారు. ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి సెక్షన్ 22ఏను తొలగింపజేస్తామని స్పష్టం చేశారు. సెక్షన్ 22ఏ జాబితాలోని భూములన్నీ తొలగించకుంటే సెక్రటేరియట్ ముట్టడిస్తామని హరీష్ హెచ్చరించారు.
బీఆర్ఎస్ మాజీ నేత హరీష్ కీలక వ్యాఖ్యలు చేసారు. సెక్షన్ 22ఏ బాధితుల సమావేశంలో వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ ఉద్దేశంతో సెక్షన్ 22ఏ తీసుకొచ్చిందని ప్రశ్నించారు. కేసీఆర్ పాలనలో ప్రజలు కేంద్రంగా పరిపాలన కొనసాగిందని తెలిపారు. అదే రేవంత్ పాలనలో భూములు కేంద్రంగా పరిపాలన కొనసాగుతోందని విమర్శించారు. ప్రజలకు ఏం కావాలో ఆలోచించిన నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్రంలో ప్రతి ఇంటికీ తాగునీరు, 24 గంటల కరెంటు అందించారని అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలని కేసీఆర్ తపన పడ్డారని చెప్పారు. కేసీఆర్ హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచారని అన్నారు. తెలంగాణను కోటి ఎకరాల మాగాణిగా మార్చారని తెలిపారు. దేశానికే తెలంగాణను అన్నపూర్ణగా మార్చారని పేర్కొన్నారు.

సెక్రటేరియట్ ముట్టడి హెచ్చరిక
రాష్ట్రవ్యాప్తంగా కోటి ఎకరాలను సెక్షన్ 22ఏ జాబితాలో చేర్చారని హరీశ్‌రావు తెలిపారు. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షలాది ఆస్తులను ఈ జాబితాలో పెట్టారని పేర్కొన్నారు. కాలనీలకు కాలనీలు 22ఏ జాబితాలోకి వెళ్లాయని అన్నారు. రాత్రికి రాత్రి భూములన్నీ నిషేధిత జాబితాలో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజలు గుండెమీద చెయ్యేసుకుని ప్రశాంతంగా నిద్రపోయే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఎప్పుడు హైడ్రా వస్తదో.. ఎప్పుడు సెక్షన్ 22ఏ వస్తదో అని భయంలో బతుకుతున్నారని తెలిపారు. కేసీఆర్ పాలనలో హైదరాబాద్‌లో అద్భుతమైన అభివృద్ధి జరిగిందని హరీశ్‌రావు కొనియాడారు. యావత్ దేశం హైదరాబాద్ వైపు చూసేలా కేసీఆర్ చేశారని అన్నారు. రేవంత్ రెడ్డి వచ్చాక హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ మంటగలిసిపోయిందని మండి పడ్డారు. అమెరికాలో ఉన్న మనవాళ్లు ఇక్కడ ఇండ్లు కొనడం ఆపేశారని తెలిపారు. పైసలుంటే అమెరికాలోనే పెట్టుబడులు పెట్టుకుంటున్నారని చెప్పారు.













Click it and Unblock the Notifications