ఏడాదిలో బీఆర్ఎస్ ప్రభుత్వం - సింహం వేటకు సిద్దం..!!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వ ఏర్పడుతోంది. ముఖ్యమంత్రిగా రేవంత్ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారుతున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్ కు 65 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉంది. బీఆర్ఎస్ కు 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ సమయంలో మాజీ మంత్రి కడియం శ్రీహరి చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వం రావడం పెద్ద ఇబ్బంది కాదని తెలిపారు.
శ్రీహరి కీలక వ్యాఖ్యలు:తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. సీఎంగా రేవంత్..మరి కొంత మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ సమయంలోనే బీఆర్ఎస్ నేతలు వరుసగా చేస్తన్న వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు గందరగోళంలో ఉన్నారని, బీఆర్ఎస్ సర్కార్ రావడం పెద్ద ఇబ్బంది కాదని స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు 39 సీట్లు వచ్చాయని అన్నారు. మిత్ర పక్షం అయిన ఎంఐఎం పార్టీకి 8 సీట్లు వచ్చాయని అన్నారు. కాంగ్రెస్ పార్టీపై బీజేపీ వ్యతిరేకంగా ఉండడంతో వారి బలం కూడా తమకే కలుస్తుందని అన్నారు. అందరి సీట్లు కలిపితే తమకు 56 సీట్లు వస్తాయని అన్నారు. సింహం రెండడుగులు వెనక్కి వేస్తోందంటే.. వేటకు సిద్ధమైనట్లేనని వ్యాఖ్యలు చేశారు.

ఏడాదిలో ప్రభుత్వం:దీని ద్వారా బీఆర్ఎస్ ఎటువంటి వ్యహాల పైన ఆలోచన చేస్తుందనే చర్చ మొదలైంది. ఇదే విధంగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కామెంట్స్ చేసారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయలేదని.. రేవంత్ ప్రభుత్వం ఏడాది కాలం వరకు మాత్రమే ఉంటుందని చెప్పుకొచ్చారు. ఆ తరువాత బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు అవుతుందని జోస్యం చెప్పారు.
ఇక..మంత్రి కేటీఆర్ సైతం కాంగ్రస్ ఇచ్చిన హామీలు అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. కొంత సమయం వరకు వేచి చూస్తామన్నారు. ఆ తరువాత ప్రజల తరపున నిలదీస్తామని స్పష్టం చేసారు. పోరాటాలు తమకు కొత్త కాదని..అందరిని కలుపుకొని ప్రజల కు ఇచ్చిన హామీల అమలుకు ఏం చేయాలో అది చేస్తామని చెప్పారు.

పథకాల చుట్టూ రాజకీయం:అదే సమయంలో తనకు ఉన్న అవగాహన మేరకు బీఆర్ఎస్ కు రానున్న రోజుల్లో అంతా మంచే జరుగుతుందని చెప్పుకొచ్చారు. ఇటు కాంగ్రెస్ కు మెజార్టీ కంటే నాలుగు స్థానాలే ఎక్కువగా ఉండటం.. అధికార పార్టీలో అంతర్గతంగా చోటు చేసుకుంటున్న పరిణామాలతో బీఆర్ఎస్ - బీజేపీ అలర్ట్ అవుతున్నట్లు కనిపిస్తోంది.
త్వరలో లోక్ సభ ఎన్నికలు జరగనుండటంతో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయ్యాక చోటు చేసుకొనే పరిణామాల పైన ఆసక్తి కనిపిస్తోంది. రేవంత్ ప్రభుత్వం రాష్ట్రంలో ఉన్న అర్దిక కష్టాలను అధిగమించి హామీలను ఏ విధంగా అమలు చేస్తుందనేది ఇప్పుడు కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications