పట్నం నరేందర్ రెడ్డికి 14 రోజుల రిమాండ్

బీఆర్​ఎస్​ నేత, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డికి న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. వికారాబాద్ జిల్లా లగచర్లలో కలెక్టర్ వాహనం సహా అధికారులపై దాడి ఘటనలో నరేందర్ రెడ్డి ప్రమేయం ఉందనే ఆరోపణల నేపథ్యంలో పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం కొడంగల్ కోర్టులో హాజరుపరిచారు.

ఈ క్రమంలో న్యాయస్థానం పట్నం నరేందర్ రెడ్డికి నవంబర్ 27 వరకు రిమాండ్ విధించింది. దీంతో నరేందర్ రెడ్డిని చర్లపల్లి జైలుకు తరలించనున్నారు. లగచర్ల ఘటనలో మంగళవారం 16 మందిని రిమాండ్ కు తరలించిన పోలీసులు.. బుధవారం మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాన నిందితుడు సురేష్ సోదరుడితోపాటు మరో ముగ్గురు ఉన్నారు. మణికొడలో నివాసం ఉంటున్న సురేశ్​ ఘటన తర్వాత పరారీలో ఉన్నాడు. నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి గాలిస్తున్నారు.

BRS leader Patnam Narender Reddy remanded for 14 days

రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు

పట్నం నరేంద్ర రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడికి పాల్పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారించామని.. నిందితుడు విశాల్ తోపాటు గ్రామంలో కొంతమంది సాక్షుల విచారణలో ప్రధాన కుట్రదారుడు నరేందర్ రెడ్డిగా తేలిందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు. హకీంపేట, పోలేపల్లి, రోటిబండ తండా, పులిచెర్ల తండా, లగచర్లకు చెందిన రైతులను నరేందర్ రెడ్డి రెచ్చగొట్టాడని పోలీసులు తెలిపారు. నిందితుడు బోగమోని సురేశ్ ను బాధిత గ్రామాలకు తరలించి బ్రెయిన్ వాష్ చేయించాడని, నిందితులకు ఆర్థిక, నైతిక సహాయంతో సహా అన్ని సౌకర్యాలను అందించారని పేర్కొన్నారు. తమ పార్టీ నేత అండగా ఉంటారని వారికి చెప్పాడని తెలిపారు.

మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి అరెస్టును మాజీమంత్రులు, బీఆర్ఎస్ నేతలు కేటీఆర్​, హరీశ్ ​రావు, సబితాఇంద్రారెడ్డి ఖండిస్తూ ఎక్స్​ వేదికగా స్పందించారు. పట్నం నరేందర్ రెడ్డిని అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గమని మాజీమంత్రి హరీశ్ ​రావు మండిపడ్డారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. పాలన గాలికి వదిలి అరెస్టులు, అక్రమ కేసులు, ముందస్తు నిర్బంధాలు విధిస్తూ రాజకీయ కక్ష తీర్చుకోవడం సిగ్గుచేటని మండిపడ్డారు.

పచ్చని పొలాల్లో ఫార్మసిటీ పేరిట చిచ్చు పెట్టడమేనా ప్రజాపాలనా? నడి రాత్రి రైతులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్​లో పెట్టడమే ఇందిరమ్మ రాజ్యమా? అని ప్రశ్నించారు. ప్రశ్నించే గొంతులను అక్రమ అరెస్టులు, కేసులు, నిర్బంధాలతో అణిచివేయలేరన్నారు. పట్నం నరేందర్ రెడ్డిని, రైతులను వెంటనే విడుదల చేయాలని హరీశ్ రావు డిమాండ్​ చేశారు.

ఇది ఇలావుండగా, కొడంగల్ మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఇంటికెళ్లిన కేటీఆర్.. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. పట్నం నరేందర్ రెడ్డి అరెస్టను ఖండిస్తున్నామన్నారు కేటీఆర్, సబితా ఇంద్రారెడ్డి. ప్రజలు సమస్యల్లో ఉన్నప్పుడు ప్రజల గొంతుకై ప్రశ్నించడం ప్రతిపక్షాల బాధ్యత అని, సమస్యలకు పరిష్కారం ఆలోచించకుండా ప్రతిపక్ష నాయకులను వేధించడం ప్రభుత్వ పనిగా మారిందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+