సారీ చెప్పండి, లేదంటే.. బీఆర్ఎస్ నేతకు టీజీపీఎస్సీ వార్నింగ్
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేశ్ రెడ్డిపై పరువు నష్టం దావా వేసింది. టీజీపీఎస్సీ నిర్వహించిన గ్రూప్-1 ఫలితాల విషయంలో తప్పుడు ఆరోపణలు చేశారని రాకేశ్ రెడ్డికి టీజీపీఎస్సీ నోటీసులు ఇచ్చింది. వారం రోజుల్లోగా సమాధానం ఇచ్చి క్షమాపణలు చెప్పాలని తేల్చి చెప్పింది.
లేదంటే పరువు నష్టం, క్రిమినల్ కేసులు బుక్ చేస్తామని టీజీపీఎస్సీ హెచ్చరించింది. ఇకపై భవిష్యత్తులో ఎలాంటి ఆరోపణలు చేయొద్దని రాకేశ్ రెడ్డికి స్పష్టం చేసింది.

తెలంగాణ గ్రూప్-1 అభ్యర్థుల సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ తేదీలివే
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) గ్రూప్ 1 అభ్యర్థులకు కీలక అప్‌డేట్ ఇచ్చింది. గ్రూప్ 1 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సెర్టిఫికేట్ల వెరిఫికేషన్ తేదీలను ప్రకటించింది. ఏప్రిల్ 16, 17, 19, 21వ తేదీల్లో నాంపల్లిలోని సురవరం ప్రతాపరెడ్డి వర్సిటీలో ధృవపత్రాల పరిశీలన ఉంటుందని పేర్కొంది.
టీజీపీఎస్సీ వెబ్‌సైట్‌లో ధృవపత్రాల పరిశీలనకు ఎంపికైన అభ్యర్థుల జాబితా ఉంటుందని టీజీపీఎస్సీ వెల్లడించింది. ఎంపికైన అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్లతో పరిశీలనకు రావాలని కమిషన్ సూచించింది.
ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్రీనింగ్ టెస్ట్
తెలంగాణ రాష్ట్రంలో ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ ప్రక్రియలో కీలక ముందడుగు పడింద. సాంకేతిక విద్య అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీకి స్క్రీనింగ్ టెస్ట్(రాత పరీక్ష) నిర్వహించాలనిప్రభుత్వం నిర్ణయించింది. పీహెచ్‌డీ అర్హత గల వారికి 10, ఈ అర్హత లేని వారికి 20 మా ర్కుల పరీక్ష నిర్వహించాలని పేర్కొంది. రాష్ట్రంలోని 12 వర్సిటీల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం జీవో-21 జారీ చేసింది.
ఇంజినీరింగ్‌యేతర కోర్సుల అసిస్టెంట్ ప్రొఫెసర్లకు రాత పరీక్ష లేకపోగా, ఇంజినీరింగ్ కోర్సులు బోధించే వారికి మాత్రం రాత పరీక్ష నిర్వ హించాలని మార్గదర్శకాల్లో స్పష్టం చేసింది. ఇంజనీరింగ్ కోర్సులు బోధించడానికి మొదట్లో బీటెక్ పూర్తి చేసిన వారికి అవకాశం కల్పించగా.. ఆ తర్వాత ఎంటెక్ చేసిన వారికి కూడా అవకాశం కల్పించారు. ఇప్పుడు స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించాలంటూ కొత్త మార్గదర్శకాలు జారీ చేశారు. కాగా, ఇంజినీరింగ్‌లో పీహెచ్‌డీ పూర్తిచేసిన వారు చాలా తక్కువ సంఖ్యలో ఉన్నారు. నెట్, సెట్ అర్హత గల వారు కూడా అరుదుగా ఉండటంతో స్క్రీనింగ్ టెస్టు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణ యించింది.
-
రోజూ గుప్పెడు గింజలు తినండి.. షుగరు, బీపీ పూర్తిగా కంట్రోల్...!! -
ఎట్టకేలకు రైతుల ఖాతాల్లో నిధుల జమ, ఫలించిన నిరీక్షణ..!! -
AP Inter Results: ఏపీలో ఇంటర్ ఫలితాల ముహూర్తం ఫిక్స్, అఫీషియల్..!! -
బుమ్రా, హాజెల్ వుడ్.. నాకు ఎవడైనా ఒక్కటే: వైభవ్ సూర్యవంశీ -
SRH కొంపముంచిన క్లాసెన్ జిడ్డు బ్యాటింగ్ -
మెగాస్టార్‌ని ఇండియాలో హయ్యెస్ట్ రెమ్యునరేషన్ హీరోగా మార్చిన మూవీ ఇదే..! -
వారి ఖాతాల్లో రూ 20 వేల జమ, ప్రభుత్వం నిర్ణయం - అర్హతలు.. మార్గదర్శకాలు..!! -
వారి గ్రీన్ కార్డులు అవుట్ -
కెరీర్ లోనే ఫస్ట్ ప్లాఫ్.. ఎలా తట్టుకుంటున్నావ్ అన్నా..!! -
పాకిస్థాన్ లోనే ఫాస్టెస్ట్ ట్రైన్ ఇదేనట.. స్పీడ్ చూస్తే మాత్రం.. మన ప్యాసింజర్ ట్రైన్స్ నయం..! -
US Visa: స్లాట్లు ఓపెన్. కానీ ప్రయాణం సేఫ్ కాదు! -
పాకిస్థాన్ కు ఎగిరి గంతేసే వార్త.. ఒకేసారి రూ. 41,500 కోట్లు సాయం అందింది..!!












Click it and Unblock the Notifications